జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టివి 9 పై విమర్శల పరంపర కొనసాగిస్తూనే ఉన్నారు. గత రెండు రోజులుగా టివి 9పై వరుస ట్విట్లతో హల్ చల్ చేస్తున్నారు. ఇవాళ కూడా టివి 9 ను వదలలేదు పవన్. కొద్దిసేపటి క్రితమే పవన్ ఒక పోస్టును ట్విట్టర్ లో పెట్టారు.

దాని సారాంశం ఏమంటే..? శ్రీరెడ్డి పవన్ ను, పవన్ తల్లిని గలీజు భాషలో తిట్టిన విషయం తెలిసిందే. అయితే ఆ వీడియోను టివి 9లో పదే పదే ప్రసారం చేశారనే వివరాలతో కూడిన ఒక పోస్టును పవన్ తన ట్విట్టర్ ఎకౌంట్ లో పోస్టు చేశారు. అంతేకాదు.. ఈ వీడియోను టివి9 యాజమాని తన తల్లికి, తన భార్యకు, తన బిడ్డకు చూపించాలని సవన్ సవాల్ చేశారు.

అంతేకాదు మరో ఘాటైన విమర్శ కూడా చేశారు పవన్. అదేమంటే నీ సంపద ఎలా పోగైందో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకో అంటూ టివి 9 అధిపతి శ్రీనిరాజుకు సూచించారు పవన్.

మొతతానికి పవన్ టివి 9 ను వదిలేలా లేడన్న వాదన మాత్రం రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.