Asianet News TeluguAsianet News Telugu

బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. సీఎం రేవంత్ తో మాజీ మంత్రి దంపతులు భేటీ ..

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఆయన భార్య, వికారాబాద్ జడ్పీ ఛైర్‌పర్సన్ సునీతా మహేందర్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. వారిద్దరూ మర్యాదపూర్వకంగా సీఎంను కలిసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కానీ పార్టీ వీడుతున్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. 

patnam mahender reddys couple who met cm revanth reddy decided to join congress soon and resign to brs party KRJ
Author
First Published Feb 9, 2024, 5:35 AM IST | Last Updated Feb 9, 2024, 5:59 AM IST

పార్లమెంట్ ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ బీఆర్ఎస్ పార్టీకి వరుసగా భారీ షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు సీనియర్ నేతలు కారు దిగి.. హస్తం గూటికి చేరుతున్నారు. తాజాగా బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఆయన సతీమణి, వికారాబాద్‌ జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ పట్నం సునీతామహేందర్‌రెడ్డి గురువారం నాడు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డిని కలిశారు.

రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, డీసీసీ అధ్యక్షుడు రోహన్ రెడ్డి తదితరులతో కలిసి సీఎం రేవంత్ నివాసానికి వెళ్లిన మహేందర్ రెడ్డి దంపతులు.. ముఖ్యమంత్రితో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి కూడా వీరితోపాటు ఉన్నారు. కాగా, గత కొద్ది రోజులుగా సీఎం రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు కలవడం చర్చనీయాంశంగా మారింది. వారిద్దరూ మర్యాదపూర్వకంగా సీఎంను కలిసినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. కానీ బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని దంపతులు నిర్ణయించుకున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి సునీతకు కాంగ్రెస్‌ టికెట్‌ ఇవ్వాలని కోరగా, ఆమెకు నామినేషన్‌ వేసేందుకు కాంగ్రెస్‌ అధిష్టానం సుముఖంగా ఉన్నట్లు సమాచారం.

ఇప్పటికే పలువురు నేతలు కాంగ్రెస్ పార్టీలోకి చేరతారంటూ ప్రచారం జరుగుతున్న వేళ.. సీఎం రేవంత్ తో మహేందర్ రెడ్డి దంపతుల భేటీలు చర్చనీయాంశంగా మారుతున్నాయి. అలాగే.. కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీతో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారనీ, వారందరూ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు కూడా పట్నం మహేందర్ రెడ్డి దంపతులు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారనే వార్తకు ఊతమిస్తున్నాయి. 

మహేందర్‌రెడ్డి 2014లో వికారాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌పై ఎమ్మెల్యేగా ఎన్నికై 2015 నుంచి 2018 వరకు అప్పటి కేసీఆర్ కేబినెట్‌లో రవాణా శాఖ మంత్రిగా పనిచేశారు. 2018లో కాంగ్రెస్ అభ్యర్థి పి.రోహిత్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. రోహిత్ రెడ్డి ఆరు నెలల్లోనే బీఆర్‌ఎస్‌కు ఫిరాయించారు. దీంతో మహేందర్ రెడ్డిని శాంతింపజేసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీగా నామినేట్ చేసి వికారాబాద్ జెడ్పీ చైర్ పర్సన్ పదవిని ఆయన భార్యకు కట్టబెట్టింది. అయినా మహేందర్‌రెడ్డి, రోహిత్‌రెడ్డి మధ్య పోటీకి తెరపడలేదు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వికారాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ టికెట్‌ కావాలని మహేందర్‌రెడ్డి డిమాండ్‌ చేసినా ఆ పార్టీ రోహిత్‌రెడ్డిని ఎంపిక చేసింది. మహేందర్ రెడ్డిని శాంతింపజేయడానికి, కేసీఆర్ అసెంబ్లీ ఎన్నికలకు కేవలం మూడు నెలల ముందు ఆగస్టు 2023లో ఆయనను I&PR మంత్రిగా తన కేబినెట్‌లోకి తీసుకున్నారు. అయితే రోహిత్‌రెడ్డి కాంగ్రెస్‌లో ఓడిపోయారు. ఈ నేపథ్యంలో మహేందర్‌రెడ్డి దంపతులు బీఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios