వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఐసీయూలో ఓ పేషెంట్‌ను ఎలుకలు కొరకడం కలకలం రేపుతోంది. 

వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఐసీయూలో ఓ పేషెంట్‌ను ఎలుకలు కొరకడం కలకలం రేపుతోంది. పేషెంట్ కాలు, చేతుల వేళ్లను ఎలుకలు కొరికేశాయి. ఎలుకల దాడిలో గాయపడిన వ్యక్తిని శ్రీనివాస్‌గా గుర్తించారు. శ్రీనివాస్ నాలుగు రోజుల క్రితం అనారోగ్యంతో ఎంజీఎంలో చేరారు. అతడికి ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 

అయితే శ్రీనివాస్‌పై కాలు, చేతులను ఎలుకలు కొరకడంతో.. తీవ్ర రక్తస్త్రావం అయింది. దీంతో శ్రీనివాస్ ఆరోగ్య పరిస్థితి పట్ల ఆందోళనలో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్టుగా విమర్శలు వినిపిస్తున్నాయి.ఐసీయూలో ఉన్న పేషెంట్ పరిస్థితే ఇలా ఉంటే.. సాధారణ వార్డుల్లో చికిత్స పొందుతున్న వారి పరిస్థితేమిటీ అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.