Asianet News TeluguAsianet News Telugu

Tragedy In Kamareddy: కామారెడ్డిలో విషాదం.. గుండెపోటుతో పేషెంట్, వైద్యం చేస్తున్న డాక్టర్ ఇద్దరు మృతి..

గుండెపోటుతో (heart attack) చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన పేషెంట్.. అతనికి వైద్యం అందిస్తున్న డాక్టర్ ఇద్దరు చనిపోయారు. ట్రీట్‌మెంట్ చేస్తున్న సమయంలో డాక్టర్‌కు కూడా గుండెపోటు రావడంతో ఇలా జరిగింది. 

Patient And doctor both died with Heart attack in kamareddy
Author
Kamareddy, First Published Nov 28, 2021, 2:04 PM IST

తెలంగాణలో కామారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం (Tragedy In Kamareddy) చోటుచేసుకుంది. గుండెపోటుతో చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన పేషెంట్.. అతనికి వైద్యం అందిస్తున్న డాక్టర్ ఇద్దరు చనిపోయారు. ట్రీట్‌మెంట్ చేస్తున్న సమయంలో డాక్టర్‌కు కూడా గుండెపోటు రావడంతో ఇలా జరిగింది. . ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.. గాంధారి మండలం గుజ్జల్ తండాకు చెందిన ఓ వ్యక్తికి గుండె పోటు (heart attack) రావడంతో కుటుంబసభ్యులు అతడిని గాంధారిలోని నర్సింగ్ హోమ్‌కు తీసుకువచ్చారు. అక్కడ డాక్టర్ లక్ష్మణ్.. పేషెంట్‌కు చికిత్స అందించడం మొదలుపెట్టాడు. 

అయితే  పేషేంటుకు ట్రీట్మెంట్ చేస్తున్న సమయంలోనే డాక్టర్ లక్ష్మణ్‌కు కూడా గుండె పోటు రావడంతో కిందపడిపోయాడు. వెంటనే అక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తర్వాత రోగి కుటుంబ సభ్యులు.. కామారెడ్డికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఇది స్థానికులను కూడా తీవ్రంగా కలిచివేసింది.

ఇక, డాక్టర్ లక్ష్మణ్.. స్వస్థలం మహబూబాబాద్. అతడు నిజామాబాద్ జనరల్ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్నారు. నిజామాబాద్ వైద్యకళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా కూడా పని చేస్తున్నారు. వీటితో పాటుగా గాంధారి మండల కేంద్రంలో ఓ ప్రైవేటు ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సమయంలోనే అతడు ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం డాక్టర్ లక్ష్మణ్ మృతదేహాన్ని అతడి స్వస్థలం మహబూబాబాద్‌కు తరలించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios