బంగారు తెలంగాణ ప్రకటనలతో చెవులకే ఆనందం కలుగుతుంది తప్ప బాధలు తీరలేదని జనాలు చెబుతున్నారు. పాలకులు మాత్రం బంగారు తెలంగాణ నిర్మాణం అంటూ జనాలను ఊదరగొడుతున్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రభుత్వ ఆసుపత్రులు అద్భుతం.. ఆహా.. ఓహో... కాపాలికా అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి అలా లేదు.

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కబడ్డది ఈ చిత్రం. అక్కడ రోగులకు పడకలు కూడా లేకపోవడంతో కింద పడుకోబెట్టి వైద్యం నడిపిస్తున్నారు. అదేకాదు సెలైన్ బాటిళ్లు పెట్టేందుకు స్టాండ్లు కూడా గతిలేవు. అందుకే పేషెంట్ల వద్ద ఉన్న అటెండెంట్లు మీరు ఊకెనే కుసోని ఏం చేస్తరు అని సెలైన్ బాటిళ్లు వాళ్ల చేతికిచ్చిర్రు.

ఈ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోనే జరిగిందని చెబుతున్నారు. సిఎం కేసిఆర్ కుమార్తె, నిజామాబాద్ ఎంపి కవిత ఈ విషయంపై తక్షణమే దృష్టి సారించాలని, ఆసుపత్రిలో సరైన సామాగ్రి అందించాలని వేడుకుంటున్నారు.