కాంగ్రెస్ గూటికి మరో మాజీ ఎమ్మెల్యే.... ఫలించిన ఉత్తమ్ వ్యూహం

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 8, Sep 2018, 5:14 PM IST
patancheru bjp leader joins congress party
Highlights

ముందస్తు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఓ పార్టీ నుండి మరో పార్టీలోకి జంపింగ్ లు ఎక్కువయ్యాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.

ముందస్తు ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తున్నాయి. ఓ పార్టీ నుండి మరో పార్టీలోకి జంపింగ్ లు ఎక్కువయ్యాయి. తాజాగా సంగారెడ్డి జిల్లాలో రాజకీయ సమీకరణలు వేగంగా మారుతున్నాయి.

హైదరాబాద్ శివారు నియోజకవర్గమైన పటాన్ చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ లో చేరడానికి రంగం సిద్దం చేసుకున్నారు. ప్రస్తుతం బిజెపి పార్టీలో వున్న అతడు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జానారెడ్డి, షబ్బీర్ అలీలతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో వారి నుండి పటాన్ చెరు నియోజకవర్గం పై స్పష్టమైన హామీ రావడంతో కాంగ్రెస్ లో చేరడానికి ఆయన సిద్దమయ్యారు.

దీంతో మరో రెండు రోజుల్లో బిజెపి కి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ గూటికి చేరడానికి నందీశ్వర్ గౌడ్ సిద్దమయ్యారు.తెలంగాణ కాంగ్రెస్ కార్యాలయం గాంధీ భవన్ లో తన అనుచరులతో కలిసి నందీశ్వర్ గౌడ్ కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.
 
loader