విమానంలో ఓ వ్యక్తి వింతగా ప్రవర్తించాడు. తన ఒంటిమీద ఉన్న దస్తులు మొత్తం తొలగించి డ్యాన్స్ చేశాడు. అతని ప్రవర్తన చూసి తోటి ప్రయాణికులంతా కంగారుపడిపోయారు. కాగా.... వెంటనే స్పందించిన సిబ్బంది అతనిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... గోవాకు చెందిన అలెగ్జాండర్(40) గోవా నుంచి హైదరాబాద్ మీదుగా కోయంబత్తూర్ వెళ్తున్న ఇండిగో విమానం ఎక్కాడు. శుక్రవారం ఉదయం 8గంటల సమయంలో విమానం శంషాబాద్ విమానాశ్రయంలో ల్యాండ్ అయ్యింది. విమానం ల్యాండ్ కాగానే అలెగ్జాండర్ తన ఒంటిపై ఉన్న దుస్తులను తొలగించి నానా హంగామా చేశాడు.

ఎయిర్ లైన్స్ సిబ్బంది వెంటనే భద్రతా బలగాలకు సమాచారం అందించడంతో అతి కష్టం మీద అతనిని కిందకు దింపి పోలీసులకు అప్పగించారు. అతనికి మతిస్థిమితం సరిగా లేదా? మత్తు పదార్ధాలు తీసుకునే అలవాటు ఉందా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అతనిని హైదరాబాద్ లో పోలీసులకు అప్పగించిన తర్వాత గంట ఆలస్యంగా  విమానం బయలుదేరింది. పోలీసులు అలెగ్జాంబర్ ను ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా... వారి కళ్లు గప్పి బయటకు పారిపోయేందుకు ప్రయత్నించాడు. మళ్లీ అతనిని పట్టుకున్నారు.