మునుగోడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్ (వీడియో)

మునుగోడు టిఆర్ఎస్ ఎమ్మెల్యేకు షాక్ (వీడియో)

తెలంగాణలో అధికార టిఆర్ఎస్ పార్టీకి చెందిన మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి స్థానికులు షాక్ ఇచ్చారు. సోమవారం పలు అభివృద్ధి పనులకు భువనగిరి ఎంపి డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి శంకుస్థాపన చేయడానికి వచ్చారు. ఈ సందర్భంగా సొంత పార్టీకి చెందిన స్థానిక సర్పంచ్ పందుల నర్సింహ్మ తన కు సమాచారం ఇవ్వ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కారు ముందు పడుకుని నిరసన తెలిపారు. సర్పంచ్ కు మద్దతుగా స్థానిక ప్రజలు, మహిళలు  ఎమ్మెల్యే కారుకు అడ్డంగా పడుకుని ఘెరావ్ చేశారు.

తను మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ గా  ఉన్నప్పటికీ దళితుడిని కాబట్టే  తనకు ఎమ్మెల్యే ఎలాంటి సమాచారం లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్ననాడని ఆరోపించారు. ఇటీవల పార్టీలో చేరిన అగ్రవర్ణాలకే ఎమ్మెల్యే నామినేటెడ్ పదవులు ఇప్పిస్తూ ఎస్సీ, ఎస్టీ,బీసీలను పట్టించుకోవడం లేదని నిరసన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా సొంత పార్టీ సర్పంచ్ నిరసనకు దిగడం నల్లగొండ జిల్లాలో హాట్ టాపిక్ అయింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos