Asianet News TeluguAsianet News Telugu

టీ హబ్ : కేటీఆర్ కు పార్లమెంట్ ఐటీ స్టాండింగ్ కమిటీ, మంత్రుల ప్రశంసల జల్లు..

ఒక ఐడియాతో తెలంగాణ ఐటీ హబ్ లోకి వెళితో ప్రొడక్టుతో బయటకు రావొచ్చంటూ మహువా మోయిత్రా ట్వీట్ చేశారు. అంతేకాదు వండర్ ఫుట్ జాబ్ ఆల్ అరౌండ్ కేటీఆర్ టీఆర్ఎస్ అంటూ ప్రశంసించారు. 

parliament it standing committee accolades T IT hub
Author
hyderabad, First Published Sep 8, 2021, 11:38 AM IST

స్టార్టప్ లను ప్రోత్సహించేందుకు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన తెలంగాణ హబ్ ని పార్లమెంట్ ఐటీ స్టాండింగ్ కమిటీ ప్రశంసించింది. శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంటు ఐటీ స్టాండింగ్ కమిటీ ఇటీవల టీ ఐటీ హబ్ ని సందర్శించారు. 

ఇక్కడ స్టార్టప్ లకు అందుతున్న సౌకర్యాలు, ప్రభుత్వపరమైన ప్రోత్సాహకాలను వారు పరిశీలించారు. తెలంగాణ ఐటీ హబ్ పనితీరును పశ్చిమ బెంగాల్ కు చెందిన టీఎంసీ ఎంపీ, ఫైర్ బ్రాండ్ మహువా మెయిత్రా మెచ్చుకున్నారు. 70వేల చదరపు అడుగుల ఇంక్యుబేటర్ సెంటర్ ని త్వరలోనే 3.50 లక్షల అడుగుల చదరపు అడుగులకు విస్తరిస్తున్నారు. 

ఒక ఐడియాతో తెలంగాణ ఐటీ హబ్ లోకి వెళితో ప్రొడక్టుతో బయటకు రావొచ్చంటూ మహువా మోయిత్రా ట్వీట్ చేశారు. అంతేకాదు వండర్ ఫుట్ జాబ్ ఆల్ అరౌండ్ కేటీఆర్ టీఆర్ఎస్ అంటూ ప్రశంసించారు. 

మహువా మోయిత్రా ప్రశంసల ట్వీట్ కు మంత్రి కేటీఆర్ స్పందించారు. థ్యాంక్యూ మహువా జీ అంటూ ట్వీట్ చేశారు. మరోవైపు తమిళనాడుకు చెందిన కార్తి చిదంబరం సైతం ఐటీ హబ్ ని మెచ్చుకున్నారు. ఇటువంటి ఐటీ హబ్ తమిళనాడుకు అవసర ఉందంటూ ట్వీట్ చేశారు. టీ హబ్ ఈజ్ వెరీ ఇంప్రెసివ్ అండ్ ఎఫెక్టివ్ ఇన్షియేటివ్ అంటూ ట్వీట్ చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios