తెలంగాణలో ప్రధాని మోడీ పర్యటన వేళ బీఆర్ఎస్ వ్యంగ్య రీతిలో ఫ్లెక్సీలతో స్వాగతం పలుకుతోంది. పరివార్ వెల్కమ్స్ యు మోడీజీ.. ఫ్లెక్సీలు వైరల్ అవుతున్నాయి. 

హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోడీ నేడు తెలంగాణలో పర్యటించిన సంగతి తెలిసిందే. నేటి మధ్యాహ్నం హైదరాబాదుకు రానున్న మోడీకి.. వినూత్న రీతిలో స్వాగతం పలుకుతూ ప్లెక్సీలు వెలిశాయి. ‘పరివార్ వెల్కమ్స్ యు మోడీజీ’ అంటూ.. బిజెపిలోని నాయకులు, వారి వారసుల ఫోటోలతో పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. బిజెపిలోని కీలక నేతలు వారి వారసుల ఫోటోలతో వెలిసిన ఈ ఫ్లెక్సీలతో బీఆర్ఎస్ వ్యంగ్య స్వాగతానికి తెరలేపింది. ‘మీ పరివారం మీకు ఆహ్వానం పలుకుతోంది’ అంటూ వ్యంగ్యంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు.

ఈ ఫ్లెక్సీలో అదానీ, అంబానీల వారసులతోపాటు.. అమిత్ షా, మాధవ రాజ్ సింథియా, రాజ్ నాథ్ సింగ్, యడ్యూరప్ప, వసుంధర రాజ్, ప్రమోద్ మహాజన్, గోపీనాథ్ ముండే.. లాంటి నేతలు వారి వారసుల ఫోటోలతో ఈ వ్యంగ్య ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా బీఆర్ఎస్ ఈ విధంగా మరో ప్రచారాస్త్రానికి తెరలేపింది. బిజెపిలోని కీలక నేతల వారసుల ఫోటోలతో వెలసిన ఈ ఫ్లెక్సీలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

తల్లిని గొడ్డలితో నరికి అతి దారుణంగా హత్య చేసిన కొడుకు.. అడ్డువచ్చిందనే...

కమలం పార్టీ నేతలు పరివారానికే పట్టం కడుతున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. ఈ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలంగాణలో బీఆర్ఎస్, బిజెపిల మధ్య వివాదాలు అందరికీ తెలిసినవే. జాతీయ పార్టీ పేరుతో…జాతీయ రాజకీయాల్లోకి తెలంగాణ అధినేత కేసిఆర్ ప్రవేశించడానికి ప్రయత్నించడం.. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అధికారమే ధ్యేయంగా బిజెపి ఎత్తులు వేస్తుండడంతో.. రాజకీయం వేడెక్కింది. 

గత కొంతకాలంగా ప్రధాని మోదీ మీద కెసిఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే మరోసారి మోదీ తెలంగాణలో పర్యటిస్తున్న కేసీఆర్ ఆయనను కలవడానికి వెళ్లడం లేదు. ప్రోటోకాల్ లో భాగమైన కూడా దాన్ని పాటించడం లేదు. సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధాని మోదీకి స్వాగతం పలకనున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత మీద ఈడి విచారణలు.. పదో తరగతి పరీక్ష పత్రాల లీకేజీ విషయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు, విడుదల నేపథ్యంలో.. నేడు మోడీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. 

Scroll to load tweet…