హైదరాబాద్: స్కూల్స్ కు వచ్చే విద్యార్ధులకు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.సోమవారం నాడు  హైద్రాబాద్ లో  విద్యాసంస్థలు (స్కూల్స్, కాలేజీలు) పున: ప్రారంభించే విషయమై మంత్రి విద్యాశాఖాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు.

also read:విద్యా సంస్థల రీ ఓపెన్: ఉన్నతాధికారులతో సబితా సమీక్ష

ఫిబ్రవరి 1వ తేదీ నుండి క్లాసులను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.దీంతో ఈ నెల 25వ తేదీ నాటికి టీచర్లు, విద్యాసంస్థలు సన్నద్దమై ఉండాలని మంత్రి ఆదేశించారు. క్లాసులకు హాజరయ్యే విద్యార్ధులు భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని  మంత్రి కోరారు. విద్యార్ధుల మధ్య కనీసం ఆరు అడుగుల దూరం ఉండేలా చూడాలని  మంత్రి కోరారు. హాస్టళ్లల్లో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని ఆమె సూచించారు.

విద్యాసంస్థల పున: ప్రారంభించే విషయంలో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలనే విషయమై  రేపు పేరేంట్స్ అసోసియేషన్ తో మంత్రి సబితా ఇంద్రారెడ్డి చర్చించనున్నారు. ట్యూషన్ ఫీజు తప్ప ఇతర ఏ ఫీజు తీసుకోవద్దని కూడ ఆదేశాలు జారీ చేశామని మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ ఆదేశాలు పాటించని విద్యాసంస్థలపై చర్యలు తీసుకొంటామని మంత్రి హెచ్చరించారు.