ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో నాగుపాము కలకలం రేపింది. మెటర్నటీ వార్డులోకి చొరబడి భయాందోళనలకు గురి చేసింది. ఎక్కడ్నుంచి వచ్చిందో.. ఎలా వచ్చిదో తెలియదు కానీ కాసేపు వార్డులో గందరగోళాన్ని సృష్టించింది. 

నాగుపామును గమనించిన వార్డులోని పేషంట్లు బిగ్గరగా కేకలు వేయడంతో.. ఆ శబ్దాలకు బాత్రూంలోకి వెళ్లింది. ఆ తరువాత విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన ఆస్పత్రి సిబ్బంది బాత్రూంలో వెతికారు. అయితే మూత్రశాలలో చెత్త చెదారం ఉండడంతో ఎంత వెతికినా పాము దొరకలేదు.

చివరకు వార్డు నుంచి రోగులను వేరే గదికి మార్చారు. కాగా రిమ్స్ అధికారుల నిర్లక్ష్యం వల్లే, తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని రోగులు, వారి బంధువులు వాపోతున్నారు. జిల్లా అధికారులు దీని మీద వెంటనే స్పందించాలని కోరుతున్నారు.