అరుదైనా చేప  పంగాసీయ‌స్ సైలాసీ ఫిష్. పంగాసీయ‌స్ సైలాసీ ఫిష్ తెలంగాణలో లభ్యం. నాగార్జునా సాగర్ జలాలలో ఉన్నాయి. 

చాలా అరుదుగా ల‌భించే మ‌త్స్య‌ సంపద‌కు తెలంగాణ కొలువైంది. పంగాసీయ‌స్ సైలాసీ ఫిష్ నాగార్జున సాగ‌ర్ జ‌ల‌శాయాల‌లో పెరుగుతుంది. పంగాసీయ‌స్ సైలాసీ అంటే ప‌లుపు జ‌ల్ల అని అర్థం. ప్ర‌పంచంలోనే చాలా కొద్ది ప్రాంతాల‌లో ల‌భించే ఈ చేప చాలా ప్ర‌త్కేకం. సాధార‌ణంగా ఈ చేప కేవ‌లం స‌ముద్రాలలోనే ఉంటుంది. ఇది అసాధార‌ణ పరిస్థితుల‌ను త‌ట్టుకుంటుంది. నీటిలో ప‌లు ర‌కాల రంగుల‌ను మార్చుకుంటుంది.


పంగాసీయ‌స్ సైలాసీ ఫిష్‌లు నాగార్జున సాగ‌ర్‌లో చాలా విరివిగా ల‌భిస్తున్నట్లు అక్క‌డి మ‌త్స్య శాఖ అధికారులు గుర్తించారు. అయితే వీటిని మ‌త్స్యకారులకు దొరికితే అధికారులకు సమాచారం ఇవ్వాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. వీటిని అధికారులు డ‌బ్బులు ఇచ్చి కొనుగోలు చేస్తామ‌ని తెలిపారు. వీటిపైన మ‌రింత ప‌రిశోధ‌న జ‌ర‌పాల‌ని చైన్నై ఐసీఆర్‌కి చెందిన శాస్త్ర‌వేత్త అజిత్ తెలిపారు.