Asianet News TeluguAsianet News Telugu

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కోవర్టు రాజకీయాలు చేశారు.. పాల్వాయి స్రవంతి సంచలన కామెంట్స్

మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ ప్రాజస్వామ్యాన్ని ఖూనీ చేశాయని కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి విమర్శించారు. మద్యం ఏరులై పారిన ఎన్నిక ఇది అని అన్నారు. 

Palvai sravanthi Sensational Comments On Komatireddy venkat reddy
Author
First Published Nov 7, 2022, 2:04 PM IST

మునుగోడులో టీఆర్ఎస్, బీజేపీ ప్రాజస్వామ్యాన్ని ఖూనీ చేశాయని కాంగ్రెస్ నాయకురాలు పాల్వాయి స్రవంతి విమర్శించారు. మద్యం ఏరులై పారిన ఎన్నిక ఇది అని అన్నారు. మునుగోడు ఉపఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన పాల్వాయి స్రవంతి.. డిపాజిట్‌ కూడా దక్కించుకోలేకపోయారు. మునుగోడు ఉప ఎన్నికలో తన ఓటమికి సంబంధించిన అంశాలపై ఆమె సోమవారం మీడియాతో మాట్లాడారు. మునుగోడులో టీఆర్ఎస్ ప్రలోభాలతో గెలిచిందని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ, టీఆర్ఎస్‌లు దాదాపు రూ. 500 కోట్లు చేశాయని అన్నారు. 

ఫోటో మార్పింగ్ చేసి తాను సీఎంను కలిసినట్టుగా సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడులో అక్రమాలపై ఎన్నికల సంఘానికి పలుమార్లు ఫిర్యాదు చేశామని చెప్పారు.  

Also Read: లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవు.. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు ఇచ్చాం: జైరాం రమేష్

కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కోవర్టు రాజకీయాలు చేశారని పాల్వాయి స్రవంతి ఆరోపించారు. ఇది కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ చేసిందన్నారు. కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని గుర్తించిందని అన్నారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు ఉంటాయనే విశ్వాసం ఉందని వెల్లడించారు. 

Follow Us:
Download App:
  • android
  • ios