Asianet News TeluguAsianet News Telugu

Huzurabad Bypoll : బిజెపీ రెచ్చగొట్టి కయ్యానికి కాలుదువ్వుతోంది.. ఈసీకి ఫిర్యాదు.. పల్లా (వీడియో)

కమాలపూర్ లో జరిగిన యాక్సిడెంట్ విషయంలో టీఆర్ఎస్ ను తప్పు పట్టే ప్రయత్నం చేశారు. ఇల్లంతకుంట మండలం సిరిసెడ్ లో కూడా టీఆర్ఎస్ కార్యాలయం ముందు నానా హంగామా చేశారు.

Palla Rajeshwar Reddy press meet in Huzurabad over BJP attacks
Author
Hyderabad, First Published Oct 25, 2021, 2:10 PM IST

కరీంనగర్ జిల్లా : హుజూరాబాద్ లో బిజెపి నాయకులు టీఆర్ఎస్ కార్యకర్తలను రెచ్చగొట్టి కయ్యానికి దిగుతున్నారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మండిపడ్డారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు.

"

Huzurabadలో బిజెపి నాయకులు TRS కార్యకర్తలను రెచ్చగొట్టి కయ్యానికి దిగుతున్న విషయంపై ఎన్నికల కమిషన్ తో సహా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నామని Palla Rajeshwar Reddy అన్నారు. 

కమాలపూర్ లో జరిగిన యాక్సిడెంట్ విషయంలో టీఆర్ఎస్ ను తప్పు పట్టే ప్రయత్నం చేశారు. ఇల్లంతకుంట మండలం సిరిసెడ్ లో కూడా టీఆర్ఎస్ కార్యాలయం ముందు నానా హంగామా చేశారు.

ఏపీ ప్రజలూ అడుగుతున్నారు.. ఈసీ పరిధి దాటింది: దళితబంధుపై కేసీఆర్

BJP గుండాల దగ్గర నుండి టీఆర్ఎస్ కు రక్షణ కావాలని ఫిర్యాదు చేస్తున్నాం. ఎన్నికల ముందు బిజెపి నాయకులు Election dramaలు కూడా చేస్తారు. ఈ నెల 27 న etala Rajender అతని భార్య సొమ్మసిల్లి పడిపోయి డ్రామాలతో లబ్ది పొందాలని చిల్లర డ్రామాలు చేసే ఆలోచనలతో ఉన్నట్టు సమాచారం ఉంది.

ఆరోగ్యం బాగా లేని వారిని ఆత్మహత్య యత్నం చేసే అవాకాశం కూడా ఉంది. హుజూరాబాద్ లో టీఆరెఎస్ అద్భుత విజయం సాధించబోతుందన్నారు.

ఈ సమావేశంలో మాజీ మంత్రి ఈనుగాల పెద్దిరెడ్డి మాట్లాడుతూ... 

ఈటల రాజేందర్ స్వాతంత్ర్య యోధుడు అయినట్టు తనకు తాను ఎక్కువగా ఊహించుకుంటున్నాడు E. Peddi Reddy ఎద్దేవా చేశాడు.

ఆరు సార్లు గెలిచి నియోజక వర్గంలో ఎం చేశాడో చెప్పడం లేదు. కేంద్ర మంత్రులు Telanganaకు ఉపయోగ పడే ఒక్క ప్రకటన కూడా చేపియలేదు.రెడ్డిలపై ప్రేమ ఉంటే ఈ డబ్ల్యుఎస్ రెడ్డి కార్పొరేషన్ కావాలని ఎందుకు అడుగలేదు.

నిన్న టీఆరెఎస్ పై బిజెపి నాయకులు దాడి చేద్దామని ప్రయత్నం చేసిర్రు.
రెడ్డి కులస్తులు అందరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందుతున్నారు కాబట్టి టీఆరెఎస్ కు అండగా ఉంటారు. మహాత్మా గాంధి లాగా ఒక చెంప మీద కొడితే మరో చెంప చుపెట్టం రక్షణ కల్పించుకుంటం అంటూ చెప్పుకొచ్చారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios