ఏపీ ప్రజలూ అడుగుతున్నారు.. ఈసీ పరిధి దాటింది: దళితబంధుపై కేసీఆర్

దళిత బంధు పథకానికి సంబంధించి టీఆర్‌ఎస్ ప్లీనరీ (TRS Plenary ) వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని తట్టిలేపిన ఉద్యమం.. దళిత బంధు పథకం అన్నారు.

CM KCR Key Comments on Dalit bandhu In TRS Plenary

దళిత బంధు పథకానికి సంబంధించి టీఆర్‌ఎస్ ప్లీనరీ (TRS Plenary ) వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశాన్ని తట్టిలేపిన ఉద్యమం.. దళిత బంధు పథకం అన్నారు. దళిత బంధు ప్రకటించాక.. ఆంధ్రప్రదేశ్ నుంచి వేలాది విజ్జాపనలు వచ్చాయని చెప్పారు. తెలంగాణ పథకాలు కావాలని.. ఏపీలో మీ పార్టీ పెట్టండి గెలిపించుకుంటామని విజ్జాపనలు వచ్చాయని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా హుజురాబాద్‌లో దళిత బంధు అమలుకు సంబంధించి ఎన్నికల సంఘంపై కేసీఆర్ సీరియస్ అయ్యారు. ఈసీ పరిధి దాటి ప్రవర్తిస్తుందన్నారు. 

కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ కొందరు నాగార్జున సాగర్‌లో కేసీఆర్ సభ పెట్టవద్దని హైకోర్టులో కేసు వేశారు. ఇదేనా రాజకీయం..?. హుజురాబాద్‌లో కేసీఆర్ సభ పెట్టుకుండా చేయాలని చూస్తున్నారు. ఇదేం దిక్కుమాలిన రాజకీయం..?. భారత ఎన్నికల సంఘం (Election Commission of India) రాజ్యాంగ వ్యవస్థగా వ్యవహరించాలి. గౌరవాన్ని నిలబెట్టుకోవాలి. వారు పరిధిని దాటుతున్నారు. బాధ్యత గల పార్టీ అధ్యక్షుడిగా, ఒక ముఖ్యమంత్రిగా, భారతదేశంలో సీనియర్ నేతగా భారత ఎన్నికల సంఘానికి సలహా ఇస్తున్నాను. చిల్లర పనులు మానుకోవాలి. ఇక్కడ నేను మాట్లాడే మాటలు.. హుజురాబాద్‌లో లైవ్‌లో వింటున్నారు. ప్రచారంలో ఉండటం వల్ల మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు గంగుల కమలాకర్ ఇక్కడికి రాలేకపోయారు.

Also read: TRS Plenary: టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ ఏకగ్రీవ ఎన్నిక

Huzurabad దళిత బిడ్డలు అదృష్టవంతులు. ఎన్నికల కమిషన్ ఏం చేసినా.. నవంబర్ 4 తర్వాత Dalit bandhuను ఎవరూ కూడా ఆపలేరు. ఈ స్కీమ్ తప్పకుండా అమలు అవుతుంది. గెల్లు శ్రీనివాస్‌ను మీరు గెలిపిస్తారని నాకు తెలుసు. 4వ తేదీన గెలు శ్రీనివాస్ శాసనసభ్యునిగా  వచ్చి హుజురాబాద్‌లో దళిత బంధును పూర్తి చేస్తాడు. మిగిలిన నాలుగు మండలాల్లో కూడా పైలెట్ ప్రాజెక్ట్‌గా తీసుకున్నాం. మార్చి వరకు రాష్ట్రం మొత్తం విస్తరిస్తాం.  నవంబర్, డిసెంబర్‌లలో యుద్ద ప్రతిపాదికన హుజురాబాద్‌లో దళిత బంధు అమలు చేస్తాం. తెలంగాణలోని మిగిలిన 118 మంది నియోజకవర్గాల నాయకులు, అధికారులు, దళిత బంధు కమిటీలు హుజురాబాద్‌కే వస్తారు. దళిత బంధు (Dalit bandhu) ఎలా వినియోగించుకున్నారని మిమ్మల్నే అడిగి తెలుసుకుంటారు. హుజురాబాద్‌‌లో దళిత బిడ్డలు ఏ మాత్రం చింతించాల్సిన అవసరం లేదున్నారు’అని అన్నారు. 

Also read: తెలంగాణ పథకాలు కావాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు.. ఇప్పుడు ఏపీలోనే కరెంట్ ఉండటం లేదు.. కేసీఆర్

ఇక, టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కేసీఆర్ మరోమారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కేసీఆర్ ఎన్నికను పార్టీ ఎన్నికల అధికారి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. సీఎం కేసీఆర్‌కు పార్టీ నేతలు అభినందనలు తెలిపారు. అంతకుముందు ప్లీనరీ ఆవరణలో సీఎం కేసీఆర్.. టీఆర్‌ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు. అమరవీరులకు నివాళులర్పించారు. వేదిక వద్దకు చేరుకున్న కేసీఆర్‌కు హోం మంత్రి మహమూద్ అలీ దట్టి కట్టారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios