Asianet News TeluguAsianet News Telugu

బిజెపి నాగం చూపు.. ఇంకోవైపు

  • బిజిపిలో ఇమడలేకపోతున్న నాగం
  • కాంగ్రెస్ లో చేరతారన్న ప్రచారం
  • తాజాగా మరో నాగం ఆలోచన చేస్తున్నారు
palamuru strong Nagam is not sure of the party he should join

తెలంగాణ సీనియర్ రాజకీయ నేతగా పేరున్న నాగం జనార్దన్ రెడ్డి బిజెపిలో కుదురుకోలేకపోతున్నారా? ఆయన బిజెపిలకు ఎందుకొచ్చినానురా దేవుడా అని భావిస్తున్నారా? ఇంతకూ ఆయన బిజెపిలో ఉంటారా? బయటకు పోతారా? బయటకు పోతే ఆయనకు ఉన్న ఆప్షన్స్ ఏమిటి? ఈ అంశాలను తెలుసుకోవాలంటే చదవండి.

తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులను చూస్తే.. ఇక బిజెపిలో ఇమిడే వాతావరణం లేదని నాగం నిర్దారించున్నట్లు తెలుస్తోంది. నాగం బిజెపి ని వీడి కాంగ్రెస్ లో చేరుతారన్న ప్రచారం గతంలో బాగానే సాగింది. అయితే కాంగ్రెస్ వైపు నాగం ఇప్పటి వరకు అడుగులు వేయలేకపోయారు. తాజాగా ఒక కీలకమైన వ్యవహారం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ జెఎసి ఛైర్మన్ కోదండరాంతో నాగం భేటీ అయ్యారు. ఆ సమావేశంలో కీలకమైన చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. రానున్న ఎన్నికల్లోపు జెఎసి ఛైర్మన్ కోదండరాం పార్టీ పెట్టనున్నట్లు వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కోదండరాం పార్టీతో నాగం కలిసి పనిచేస్తారా అన్న వాతావరణం నెలకొంది. కోదండరాంతో నాగం అన్ని విషయాలను ఈ సందర్భంగా చర్చించినట్లు తెలుస్తోంది. జెఎసి పార్టీ కాంగ్రెస్ కలిసి పనిచేసినా... నాగం కాంగ్రెస్ లో కాకుండా జెఎసి పార్టీ నుంచే రానున్న ఎన్నకల బరిలో ఉండొచ్చన్న ప్రచారం సాగుతోంది.

తెలుగుదేశం పార్టీలో నాగం జనార్దన్ రెడ్డి ఒక వెలుగు వెలిగారు. పాలమూరు జిల్లాలో ఏండ్ల తరబడి ఆయన చక్రం తిప్పారు. తెలంగాణలోనూ పేరున్న నేతగా నిలిచారు. టిడిపిలో చంద్రబాబు తర్వాత నెంబర్ 2 స్థానంలో కూడా నాగం కొనసాగిన దాఖలాలున్నాయి. అయితే అదంతా గతం. ఇప్పుడు మాత్రం ఆయన బిజెపిలో ఇమడలేకపోతున్నారు. టిడిపిలో అంత క్రేజ్ ఉన్న నాగం జనార్దన్ రెడ్డి తెలంగాణ కోసమే ఆ పార్టీని వీడారు. అయితే కొంతకాలంపాటు ఆయన తెలంగాణ నగారా సమితి పేరుతో కార్యకలాపాలు సాగించారు. కానీ ఆ సంస్థను ఎంతోకాలం నడపలేక దాన్ని మూసేసి గత ఎన్నికల ముందు బిజెపిలోకి చేరారు. పాలమూరు ఎంపిగా పోటీ చేసి ఎపి జితేందర్ రెడ్డి చేతిలో ఓటమిపాలయ్యారు. ఎన్నికల నాటినుంచి ఆయన బిజెపిలో ఇమిడలేని పరిస్థితుల్లో ఈ మూడున్నరేళ్లు నెట్టుకొచ్చారు. గతంలో కేసిఆర్ సమకాలీకుడు కావడంతో ఆయన టిఆర్ఎస్ లో చేరలేకపోయారు.

తెలంగాణ సర్కారు వైఫల్యాలను ఎండగట్టేందుకు కేసిఆర్ సర్కారుపై కలబడి పోరు చేయాలన్న ఉత్సుకతతో నాగం ఉన్నారు. కానీ తెలంగాణ బిజెపిలో ఆ పరిస్థితి లేదు. దీంతో మూడున్నరేళ్లుగా మింగలేక కక్కలేక అన్నట్లు బిజెపిలో కొనసాగుతున్నారు. తెలంగాణ బిజెపి నేతలు మాత్రం టిఆర్ఎస్ సర్కారుతో పెద్దగా పోరాటం చేయకుండా ఫ్రెండ్ షిప్ చేసే వాతావరణం ఉంది. దీంతో ఆ వ్యవహారం నాగం కు నచ్చడంలేదు. దీనికితోడు కేంద్రం నుంచి వచ్చిన కేంద్ర మంత్రులంతా టిఆర్ఎస్ సర్కారును పోటీ పడి పొగిడిపోయారు. ఢిల్లీకి టిఆర్ఎస్ మంత్రులు వెళ్లినా కేంద్ర మంత్రులు వీళ్లనే పొడిగిన దాఖలాలున్నాయి. దీంతో ఈ అంశంలో నాగం చాలా గుర్రుగా ఉన్నారు.

ఈ నేపథ్యంలో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ లో బిజెపి విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ బిజెపి సంబరాలు జరిపింది. ఆ సంబరాల్లో నాగం ఎక్కడ కూడా కనిపించలేదు. అందుకే నాగం బిజెపికి గుడ్ బై చెప్పవచ్చని చెబుతున్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios