పాలకుర్తి సోమేశ్వరుని ప్రసాదంలో బల్లి

palakurthi someshwara laxmi narasimhaswamy temple issue about prasadam
Highlights

  • పాలకుర్తిలో  లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రసాదంలో బల్లి
  • ఆందోళన చెందిన భక్తులు
  • ఘటనపై వెంటనే చర్యలు తీసుకున్న దేవాలయ ఈవో   

 
 తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటి పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహస్వామి ఆలయం.  ఇక్కడ పనిచేసే అధికారుల నిర్లక్ష్యం మరోసారి భయటపడింది. ఆలయంలో అధికారికంగా విక్రయించే  ప్రసాదం చనిపోయిన బల్లి  రావడంతో భక్తులు ఆందోళన చెందారు. అధికారులు వంటశాలలను, ప్రసాద తయారిని పర్యవేక్షించకుండా అపరిశుభ్ర వాతావరణంలోనే నిర్వహిస్తూ ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని భక్తులు ఆవేదన చెందుతున్నారు.
 వివరాలను పరిశీలిస్తే విస్నూరు గ్రామానికి చెందిన నేతి వెంకటరమణ  కుటుంబంతో కలిసి  లక్ష్మీనర్సింహస్వామిని గుడికి వెళ్లారు.  గుట్టపైన మండపం ఆవరణలో గల ప్రసాద కౌంటర్లో పులిహోర  ప్యాకెట్లు కొనుగోలు చేశారు.  ఆయన కూతురు వర్ణిక తింటున్న పులిహోరలో బల్లి కనిపించడంతో  వారు బయపడిపోయారు. వెంటనే పాపకు ఎలాంటి అపాయం జరగకుండా స్థానిక  ప్రైవేటు ఆస్పత్రికి తరలించి  వైద్యం అందించారు.
ఆలయ ఈవో సదానందం  ప్రసాదంలో బల్లి మృతి చెందిన మాట వాస్తవమేనని అంగీకరించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. అయితే ప్రస్తుత ఘటనను సీరియస్ గా తీసుకున్నామని,   వెంటనే కాంట్రాక్టర్‌ను తొలగించినట్లుఆయన తెలిపారు.
 

loader