కేసీఆర్‌ను అవమానిస్తే సహించబోమని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆయన అభిమానులు హెచ్చరించారు

ఏపీలో కేసీఆర్ చిత్రపటానికి మరోసారి పాలాభిషేకం చేశారు. ఇటీవల ఏపీలో కొందరు నేతలు కేసీఆర్ ఫ్లెక్సీని చెప్పులతో కొట్టి అవమానించారు. దీనిపై విజయవాడలోని ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కేసీఆర్‌ను అవమానిస్తే సహించబోమని ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడకు చెందిన ఆయన అభిమానులు హెచ్చరించారు.ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఇందుకుగాను కేసీఆర్‌ చిత్రపటానికి అభిషేకం చేసి.. మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు. గతంలో కూడా ఏపీలో కొందరు అభిమానంతో కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.