Asianet News TeluguAsianet News Telugu

పాక్ యువతితో హైద్రాబాద్ యువకుడు లవ్: ప్రేమ జంట సహా నలుగురు బీహార్ లో అరెస్ట్

పాకిస్తాన్ కు చెందిన యువతితో ప్రేమలో పడ్డాడు హైద్రాబాద్ యువకుడు. ఆమెను పెళ్లి చేసుకొనేందుకు పాకిస్తాన్ నుండి హైద్రాబాద్ కు రప్పించేందుకు ప్రయత్నిస్తుండగా బీహార్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ పత్రాలతో  ఉన్న పాకిస్తాన్ యువతి సహా మరో ముగ్గురిని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు తెలిపారు.

Pakistani woman attempts to cross border for Hyderabadi lover
Author
Hyderabad, First Published Aug 11, 2022, 2:21 PM IST

హైదరాబాద్:పాకిస్తాన్  యువతితో ప్రేమలో పడిన హైద్రాబాద్ యువకుడు ఆ యువతిని హైద్రాబాద్ కు తీసుకువస్తున్న సమయంలో బీహార్ లో  పోలీసులకు చిక్కాడు. ఈ సమాచారాన్ని బీహార్ పోలీసులు హైద్రాబాద్  పోలీసులకు సమాచారం ఇచ్చారు. 

పాకిస్తాన్ కు చెందిన యువతి ఖాలిజానూర్ తో హైద్రాబాద్ పాతబస్తీకి చెందిన  అహ్మద్ అనే యువకుడు ప్రేమలో పడ్డాడు. సోషల్ మీడియాలో వీరిద్దరికి పరిచయం ఏర్పడింది. ఖాలిజానూర్ ను వివాహం చేసుకొంటానని అహ్మద్ తన సోదరుడికి చెప్పాడు. పాకిస్తాన్ లో ఉన్న యువతిని హైద్రాబాద్ కు రప్పించేందుకు సహయం చేయాలని సోదరుడు మహమూద్ ను అహ్మద్ కోరాడు. దీంతో మహమూద్ నేపాల్ లలోని జీవన్ సహాయం కోరాడు. ఇందుకు అతను కూడా సహకరించేందుకు అంగీకరించాడు. 
  పాకిస్తాన్ నుండి ఖాలిజానూర్ నేపాల్ కు చేరుకుంది. నేపాల్ నుండి బీహార్ మీదుగా ఇండియాలోకి యువతిని తీసుకు రావాలని ప్లాన్ చేశారు.  పాకిస్తాన్ నుండి  నేపాల్  చేరుకున్న ఖాలిజానూర్ ను జీవన్ నేపాల్ నుండి బీహార్ కు సరిహద్దులకు తీసుకు వచ్చాడు. దీంతో  బీహార్ సరిహద్దుల గుండా దేశంలోకి ఈ నలుగురు ప్రవేశించే ప్రయత్నం చేస్తున్న సమయంలో గుర్తించిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. ఖాలిజానూర్ వద్ద ఉన్న పత్రాలు నకిలీవిగా తేల్చారు పోలీసులు. ఖాలిజానూర్ తో పాటు అహ్మద్, మహమూద్, జీవన్ లను బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ విషయాన్ని హైద్రాబాద్ పోలీసులకు సమాచారం ఇచ్చినట్టుగా  బీహార్ లోని సీతామర్హి జిల్లా ఎస్పీ హరికిషోర్ రాయ్ తెలిపారు.

హైద్రాబాద్ కు చెందిన అహ్మద్ ను వివాహం చేసుకోవాలని పాకిస్తాన్ యువతి తన తల్లిదండ్రులకు చెప్పింది. అయితే ఈ విషయమై వారు ఒప్పుకోలేదన్నారు. దీంతో ఆమె ఇంట్లో చెప్పకుండా హైద్రాబాద్ కు పారిపోయి వచ్చేందుకు నేపాల్ కు వచ్చిందని ఎస్పీ వివరించారని ప్రముఖ తెలుగు న్యూస్ చానెల్ ఎన్టీవీ కథనం ప్రసారం చేసింది.

 


 

Follow Us:
Download App:
  • android
  • ios