Hyderabad: మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ వ‌రిధాన్యం కొనుగోలు గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,129 కొనుగోలు కేంద్రాల్లో 26 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామ‌ని చెప్పారు. ఇది గ‌తేడాదితో పోలిస్తే  ఎనిమిది లక్షల మెట్రిక్‌ టన్నులు అధికమ‌ని తెలిపారు. 

Civil Supplies Minister Gangula Kamalakar: మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ వ‌రిధాన్యం కొనుగోలు గురించి మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఇప్పటి వరకు 6,129 కొనుగోలు కేంద్రాల్లో 26లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామ‌ని చెప్పారు. ఇది గ‌తేడాదితో పోలిస్తే 8లక్షల మెట్రిక్‌ టన్నులు అధికమ‌ని తెలిపారు.

వివ‌రాల్లోకెళ్తే.. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు జోరుగా సాగుతున్నదని పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుక్ర‌వారం తెలిపారు. 6,129 కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు సుమారు 26 లక్షల మెట్రిక్ టన్నుల వరిని కొనుగోలు చేసిందని చెప్పారు. అయితే, ఇది గత ఏడాదితో పోలిస్తే ఎనిమిది లక్షల టన్నులు అధిక‌మ‌ని మంత్రి తెలిపారు. సుమారు 4.16 లక్షల మంది రైతుల నుంచి వరిని కొనుగోలు చేశామని చెప్పిన ఆయ‌న‌.. ఇప్పటికే ఆయా రైతుల ఖాతాల్లోకి రూ.2,154 కోట్లు జమ చేశామన్నారు.

"సాధారణంగా, ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్‌లలో ఎక్కువ వరి సేకరణ జరుగుతుంది. ఈసారి, సేకరణ సజావుగా జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఇప్పుడు, రాష్ట్రవ్యాప్తంగా వరి సేకరణ సజావుగా సాగుతోంది' అని మంత్రి కమలాకర్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 35 కేందాల్లో కొనుగోళ్లు పూర్తికావడంతో మూసివేసినట్లు కూడా మంత్రి వెల్ల‌డించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు, అక్క‌డ కల్పించిన సౌక‌ర్యాల గురించి మాట్లాడిన మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్.. కోనుగోలు కేంద్రాల్లో అన్ని ఏర్పాటు చేసిన‌ట్టు తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువస్తే మొత్తం వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు మంత్రిత్వ‌ శాఖ సర్వం సిద్ధం చేయడంతో పాటు అవసరమైన గన్నీ బస్తాలు, టార్పాలిన్ షీట్లు, తేమ శాతాన్ని కొలిచే పనిముట్లు, వరి క్లీనర్లు తదితరాలను అన్ని కొనుగోలు కేంద్రాల్లో అందించిన‌ట్టు తెలిపారు.