సిల్లీ రీజన్ తో ఔటర్ టోల్ సిబ్బంది ఉద్యోగాలు పీకేశారు

Outer toll staff thrown out of the jobs
Highlights

రోడ్డున పడ్డ 600 మంది సిబ్బంది

హైదరాబాద్ నగరం చుట్టూ ఉన్న ఔటర్ రింగురోడ్డు 158 కి: విస్తీర్ణంలో ఉంది. దీనిమీద 19 టోల్ బూత్ లు ఉన్నాయి. సుమారు 600 మంది సిబ్బంది" కార్మికులు (స్థానికులు) గత ఐదు సంవత్సరాలుగా టోల్ గేట్ ల వద్ద పనిచేస్తున్నరు. కంపెనీ కాంట్రాక్టు మారిందని యాజమాన్యం వీరిని ఒక్క కలం పోటుతో తొలగించింది. గతం లో ఉన్న "ఈగల్ ఇంప్ర" కంపెనీకి  ఈసారి కాంట్రాక్టు దక్కక పోవడంతో బుధవారం అర్ధరాత్రి నుండి కొత్తగా కాంట్రాక్టు దక్కించుకున్న " IRB "అనే కంపెనీకి కాంట్రాక్టు రావడం తో వీరిని తొలగించిందని చెబుతున్నారు.

స్థానికంగా ఔటర్ రింగు రోడ్డునే నమ్ముకుని జీవనం సాగిస్తు పని చేస్తున్న దాదాపు 600 మంది కార్మికుల కుటుంబాలు రోడ్డు పాలు చేసి వారి పొట్ట కొట్టే  విధంగా “IRB  కంపెనీ వ్యవహరిస్తోందని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇతర రాష్ట్రాలు బీహార్ తదితర రాష్ట్రాల నుండి  పనిచేయడానికి వారి కి సంబంధించిన సిబ్బందిని తీసుకుని వచ్చి స్థానికంగా హైదరాబాద్ చుట్టు పక్కల ఉన్న రంగరెడ్డి మేడ్చల్ హైదరాబాద్ టోల్ బూత్ లలో పని చేసే కార్మికులను తొలగించడముతో వారు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.

కాంట్రాక్టు మారినంత మాత్రాన మా ఉద్యోగులను తొలగించడం అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని ప్రశ్నించడంతో కొన్నిచోట్ల వాగ్వివాదం గొడవలతో పాటు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఉద్యోగాలు పోవడంతో కార్మికులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి కాంట్రాక్ట్ పొందిన కంపెనీతో మాట్లాడి తమ ఉద్యోగాలు తమకు ఇప్పివ్వాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు. వారి ఆందోళన తాలూకు వీడియో కింద ఉంది చూడండి.

"

loader