Asianet News TeluguAsianet News Telugu

పైలట్ సురక్షితంగా తిరిగి రావాలి: ఎంపీ అసదుద్దీన్ ఆకాంక్ష

ఇలాంటి కష్టసమయంలో ఆ వీర పైలట్‌కి అతని కుటుంబం కోసం తాము ప్రార్థన చేస్తున్నట్లు తెలిపారు. జెనియా కన్వెన్షన్స్‌లోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రతీ పార్టీ బందీల పట్ల మానత్వంతో వ్యవహరించాలని కోరారు. పాకిస్థాన్ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పక్కన పెట్టి ఐఏఎఫ్ పైలట్ విషయంలో మానవత్వంలో మెలగాలని కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు.

Our prayers are with the brave IAF pilot & his family says asaduddin owaisi
Author
Hyderabad, First Published Feb 27, 2019, 6:25 PM IST

ఢిల్లీ: భారత్ వాయుసేనకు చెందిన మిగ్21 విమానం కుప్పకూలడంపై ఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విచారం వ్యక్తం చేశారు. పైలట్ సురక్షితంగా తిరిగి రావాలని ప్రార్థిస్తున్నట్లు ఆయన తెలిపారు. బుధవారం ఉదయం భారత్ వాయుసేనకు చెందిన మిగ్ 21 విమానం కూలిపోయింది. 

ఆ విమానం పైలట్ జాడ కనిపించకుండా పోవడం, ఆ తర్వాత కొద్ది సేపటికే పాకిస్థాన్ ఆ పైలట్ ని తమబలగాలు అదుపులోకి తీసుకున్నాయని  ప్రకటించడం కలకలం సృష్టించింది. మిగ్ 21 విమానం కూలిపోవడం పైలట్ ని పాకిస్థాన్ బలగాలు అదుపులోకి తీసుకోవడం బాధాకరమన్నారు. 

ఇలాంటి కష్టసమయంలో ఆ వీర పైలట్‌కి అతని కుటుంబం కోసం తాము ప్రార్థన చేస్తున్నట్లు తెలిపారు. జెనియా కన్వెన్షన్స్‌లోని ఆర్టికల్ 3 ప్రకారం ప్రతీ పార్టీ బందీల పట్ల మానత్వంతో వ్యవహరించాలని కోరారు. 

పాకిస్థాన్ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను పక్కన పెట్టి ఐఏఎఫ్ పైలట్ విషయంలో మానవత్వంలో మెలగాలని కోరుతున్నానంటూ ట్వీట్ చేశారు. బుధవారం ఉదయం తీవ్రవాద శిబిరాలపై సైనికేతర భారత్ చర్యలు తీసుకున్న అనంతరం పాకిస్తాన్ సైన్యం భారత మిలటరీని లక్ష్యంగా చేసుకుంది. 

దీంతో భారత వైమానిక దళాలు పాక్‌ను సమర్థంగా తిప్పికొట్టాయి. పాకిస్తాన్‌కి చెందిన ఎఫ్16 విమానాన్ని కూల్చివేశాయి. ఈ క్రమంలో ఐఏఎఫ్‌కి చెందిన ఓ మిగ్21 విమానం కూలిపోయింది. ఈ నేపథ్యంలో మిగ్21ని నడుపుతున్న పైలట్ పాకిస్థాన్ కస్టడీలో తీసుకున్నామని ప్రకటించడం జరిగింది. 

Follow Us:
Download App:
  • android
  • ios