ఓయూ అసిస్టెంట్ ప్రొఫెసర్ పదేళ్లు ఆమెతో ప్రమాయణం: మరో యువతితో పెళ్లి

Ou proffessor cheats girl studen
Highlights

ఉస్మానియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయం అసిస్టెంట్ ప్రొఫెసర్ పై ఓ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. మ్యారేజ్ బ్యూరో ద్వారా పెళ్లి చూపులకు వచ్చి, పదేళ్ల పాటు తనతో కలిసి తిరగడమే కాకుండా రూ. 25 లక్షలు తీసుకుని మోసం చేశాడని యువతి ఆరోపించింది.

హైదరాబాదులోని ఉప్పల్‌కు చెందిన డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ ఓయూ టెక్నాలజీ కళాశాలలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గానే కాకుండా ఓయూ పరీక్షల విభాగంలో అదనపు కంట్రోలర్‌గా కూడా పనిచేస్తున్నాడు. ఓయూ కెమిస్ట్రీ విభాగంలో పరిశోధనలు చేస్తున్న యువతి ఓ  యూనివర్సిటీలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గానూ పని చేస్తోంది. 

మ్యారేజీ బ్యూరో ద్వారా సంబంధం కుదిరి ఇద్దరికీ ఒకరికొకరు నచ్చారు. దాంతో వారిద్దరు పదేళ్లుగా స్నేహం కొనసాగించారు. కిరణ్‌కుమార్‌ తన అవసరాల కోసం ఆ యువతి నుంచి రూ.25లక్షలు తీసుకున్నాడు. 

తనను పెళ్లిచేసుకోవాలని ఆమె ఇటీవల ఒత్తిడి చేయడం ప్రారంభించింది.  తన అక్కల పెళ్లి జరిగిన తరువాత పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. అయితే, ఇంతలో అతను మరో యువతిని పెళ్లి చేసుకున్నాడని బాధితురాలు ఆరోపిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు  డాక్టర్‌ కిరణ్‌కుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. 

loader