కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 6,7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ సందర్శనకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్న సంగతి తెలిసిందే.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ నెల 6,7 తేదీల్లో తెలంగాణలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే 7వ తేదీన ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ సందర్శనకు అనుమతి ఇవ్వాలని కాంగ్రెస్ నేతలు కోరుతున్న సంగతి తెలిసిందే. రాజకీయాలకు అతీతంగా రాహుల్ ఓయూకి వస్తారని వారు చెబతున్నారు. అయితే ఓయూలో రాజకీయ సభలకు అనుమతి లేదని చెప్పి యూనివర్సిటీ అధికారులు.. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వలేదు. దీంతో ఈ నెల 7న విద్యార్థులతో ముఖాముఖికి అనుమతి ఇవ్వాలంటూ హైకోర్టులో మానవతారాయ్ సహా నలుగురు పిటిషన్ దాఖలు చేశారు.
అయితే తాజాగా ఓయూలో రాహుల్ పర్యటనకు వీసీ అనుమతి నిరాకరించారు. రాజకీయ సభలకు ఓయూలో అనుమతివ్వకూడదని పాలక మండలి నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇతర సంఘాల నుంచి అభ్యంతరాలు ఉన్నాయని తెలిపారు. శాంతిభద్రతలను కూడా పరిగణలోకి తీసుకుని అనుమతి ఇవ్వడం లేదని వెల్లడించారు. ఓయూలో అధికారుల సంఘం ఎన్నికల షెడ్యూల్ విడుదలైందని తెలిపారు.
ఇక, ఓయూలో రాహుల్ ఓయూ సందర్శనకు అనుమతి నిరాకరించిన నేపథ్యంలో కాంగ్రెస్ అనుబంధ విభాగాలు ఆదివారం ఆందోళన చేపట్టాయి. ఓయూ నిరుద్యోగ జేఏసీ నేత మానవతా రాయ్ ఆధ్వర్యంలో నేతలు బంజారాహిల్స్‌లోని మినిస్టర్ క్వార్టర్స్‌ను ముట్టడించారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసిన పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిని కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పరామర్శించారు.
మరోవైపు ఎన్‌ఎస్‌యూఐ రాష్ట అధ్యక్షుడు బల్మూరి వెంకట్ ఆధ్వర్యంలో విద్యార్థి నాయకులు వీసీ చాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. ఓయూ వీసీ రవీందర్ కు అందజేసేందుకు పింక్ కలర్ చీర, జాకెట్, గాజులు, మల్లె పూలను తీసుకుని వెళ్లారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. అడ్మినిస్ట్రేషన్ కార్యాలయం అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో పోలీసులు వెంకట్‌తో పాటు ఇతర నేతలను అరెస్టు చేశారు. ఎన్‌ఎస్ యూఐ నేతలను పరామర్శించేందుకు జగ్గారెడ్డి బయలుదేరుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు నేడు కూడా ఓయూలో ఎన్‌ఎస్‌యూఐ నాయకులు నిరసన వ్యక్తం చేయగా.. పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. దీంతో ప్రస్తుతం ఓయూలో టెన్షన్ వాతావరణం కొనసాగుతుంది.
