కాకతీయుల ఘన కీర్తిని నలుదిశలా చాటిన ఓరుగల్లు ఇప్పుడు మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకోబోతోంది.
కాకతీయుల ఘన కీర్తిని నలుదిశలా చాటిన ఓరుగల్లు ఇప్పుడు మళ్లీ పూర్వ వైభవాన్ని అందుకోబోతోంది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఓరుగల్లు కీర్తి కిరీటంలో ఒక్కో మణిహారం చేరుతోంది.
దేశవ్యాప్తంగా గట్టి పోటీ ఉన్నా స్మార్ట్ సిటీలో కూడా వరంగల్ చోటు సంపాదించింది. అలాగే, అమృత్ పట్టణాలలోనూ వరంగల్ ను కేంద్ర ప్రభుత్వం చేర్చింది.ఈ రెండింటితో వచ్చిన నిధులతో ఇప్పటికే నగరం కొత్త అందాలను సంతరించుకుంటోంది. మౌలికసదుపాయాలు దాటి హైటెక్కు సొబగులు దిద్దుకుంటోంది.
హైదరాబాద్ తరువాత రాష్ట్రంలో మరో ఐటీ హబ్ గా వరంగల్ నే ప్రభుత్వం ఎంచుకోంది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సందర్భంగా వచ్చే జూన్ 2న వరంగల్ అవటర్ రింగు రోడ్డు శంకుస్థాపన ప్రభుత్వం నిశ్చయించింది.
2018 డిసెంబర్ నాటికి ఈ ఓఆర్ఆర్ పూర్తి చేయనున్నారు. మార్చి 4న వరంగల్‌కు కొత్త మాస్టర్ ప్లాన్ నోటిఫికేషన్ ఇస్తామని మంత్రులు కేటీయార్, కడియం శ్రీహరి ప్రకటించారు.
ఈ వేగం చూస్తే త్వరలోనే వరంగల్ తెలంగాణకు అనధికారికంగా రెండో రాజధాని అవుతుందడనడంలో ఎలాంటి సందేహం లేదు.
