Asianet News TeluguAsianet News Telugu

కార్పొరేటర్ కొడుకు రక్షణకు రంగంలోకి దిగిర్రు

  • టోల్ ప్లాజా సిబ్బందికి కొత్త బెదిరింపులు
  • కార్పొరేటర్ కొడుకు కొట్టలేదని చెప్పించే యత్నం
  • తన కొడుకు కారు దిగలేదన్న రాంమోహన్ గౌడ్
  • మనీస్ తో పాటు ఆరుగురికి 14 రోజుల రిమాండ్
Operation begins to rescue corporators son

శ్రీశైలం హైవే మీద కడ్తాల్ టోల్ గేటు వద్ద నిన్న రాత్రి దాడికి పాల్పడిన అధికార పార్టీ నేత కొడుకును కేసుల్లోంచి తప్పించేందుకు కొందరు నాయకులు రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఈ దాడిలో బిఎన్ రెడ్డి నగర్ కార్పొరేటర్ ముద్దగౌని లక్ష్మీ ప్రసన్న రామ్మోహన్  రాంగౌడ్ కొడుకు మనీష్ గౌడ్ లేడని చెప్పాలంటూ టోల్ ప్లాజా సిబ్బందిని కొందరు నేతలు బెదిరించినట్లు వార్తలొస్తున్నాయి.

ఈ కేసులో ఉధయం నుంచి కీలక పరిణామాలు జరుగుతున్నాయి. రాత్రి టోల్ గేటు సిబ్బంది టోల్ ఛార్జి ఇవ్వాలంటూ కోరితే మనీష్ గౌడ్ అండ్ టీం వారిపై కత్తులతో దాడికి తెగబడ్డారు. చాక్ తీసి చంపుతామని బెదిరించారు. ముగ్గురికి గాయాలయ్యాయి. ఆ వీడియోలు కూడా అన్ని మీడియాల్లో హల్ చల్ చేశాయి. ఆ దాడిచేసిన సమయంలో వారు మందు తాగి ఉన్నట్లు ఆరోపణలు వినిపించాయి.

ఈ దాడిలో గాయపడిన వారిని కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డి పరామర్శించారు. బాధితులకు న్యాయం జరిగేలా పోరాటం చేస్తానన్నారు. కానీ తన కొడుకు ప్రమేయం లేదని, ఆయన దాడి చేయలేదని బాధితులతో చెప్పించేందుకు కార్పొరేటర్ మనుషులు రంగంలోకి దిగారు. బాధితులను బెదరించినట్లు వార్తలొస్తున్నాయి.

మరోవైపు తన కొడుకు కారులోనే కూర్చున్నారని, ఎవరిపై దాడి చేయలేదని మనీష్ గౌడ్ తండ్రి ముద్దగౌని రామ్మోహన్ గౌడ్ తెలిపారు. కారు మనీష్ దేనని అయితే ఆయన దాడి చేసిన వారితోపాటు ఉన్నారు కాబట్టి జైలుకు తరలించారని చెప్పారు. కానీ తన కొడుకు దాడి చేయలేదని స్పస్టం చేశారు.

ఇదిలా ఉండగా నిందితులైన ఆరుగురు వ్యక్తులను పోలీసులు రిమాండ కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉన్నది. పోలీసులు విచారణలో మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. నిందితులందరికీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios