హుజూరాబాద్ లో ఒకే ఒక్కడు

Only one candidate appeared for SSC supplimentory exam
Highlights

ఒక్కడి కోసం ఇంతమంది

హుజూరాబాద్ : కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ పట్టణంలో ఎస్సెస్సీ సప్లమెంటరీ పరీక్షకు ఒకే ఒక్కడు హాజరుకావడం చర్చనీయాంశమైంది. హుజూరాబాద్ లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎస్సెస్సీ హిందీ సప్లమెంటరీ పరీక్షకు ఒకే విద్యార్థి హాజరయ్యాడు. ఈ సెంటర్ లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరిగిన పరీక్షకు ఏడుగురు విద్యార్థులు హాజరు కావాల్సి ఉంది.

జమ్మికుంట విద్యోదయ స్కూల్ కు చెందిన కోండ్ర ప్రణయ్ అనే స్టూడెంట్ ఒక్కడే హాజరై పరీక్ష రాశాడు. ఈ ఒక్కడి కోస ఒక చీఫ్ సూపరింటెండెంట్, ఒక డిపార్ట్ మెంటల్ అధికారి, క్లర్క్, ఇన్విజిలెటర్, ఒక అటెండర్, వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి, ఇద్దరు కానిస్టేబుళ్లు విధులు నిర్వహించారు.

తనిఖీ కోసం ఇద్దరిద్దరు చొప్పున కరీంనగర్ నుంచి రెండు ఫ్లయింగ్ స్కాడ్ బృందాలు కూడా పోలీసు బందోబస్తుతో రావడం గమనార్హం.

loader