తెలంగాణ ప్రయోజనాలను బీఆర్‌ఎస్ మాత్రమే కాపాడగలదు - కేటీఆర్

బీఆర్ఎస్ (BRS) మాత్రమే తెలంగాణ (Telangana) ప్రయోజనాలను కాపాడగలదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలతో సంబంధం లేకుండా పని చేస్తే పార్లమెంట్ ఎన్నికల్లో (parliament elections 2024) తప్పకుండా బీఆర్ఎస్ కు అత్యధిక సీట్లు వస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 

Only BRS can protect the interests of Telangana.. Former Minister KTR in Nizamabad Lok Sabha election preparations..ISR

తెలంగాణ ప్రయోజనాలను కాపాడటం బీఆర్ఎస్ తోనే సాధ్యమని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకే పార్లమెంట్ లో బీఆర్ఎస్ కు సరైన ప్రాతినిధ్యం కల్పించాలని కోరారు. రాష్ట్రంలో రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ముక్కోణపు పోటీ ఉంటుందని ఆయన జోస్యం చెప్పారు. గతంలో బీఆర్ఎస్ మాత్రమే తెలంగాణ ప్రయోజనాల కోసం పోరాడిందని, భవిష్యత్తులో కూడా అదే కొనసాగుతుందని తెలిపారు.

సల్మాన్ ఖాన్ ఫాంహౌస్ లోకి అక్రమ చొరబాటు.. ఇద్దరు వ్యక్తులు అరెస్టు..

సోమవారం తెలంగాణ భవన్ లో నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేటీఆర్ పాల్గొన్నారు. ఎన్నికల్లో పార్టీ పనితీరును మెరుగుపర్చుకోవడానికి పార్టీ కార్యాచరణను మార్చాల్సిన అసవరం ఉందని అన్నారు. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా అవసరమైన మార్పులు చేస్తామని హామీ ఇచ్చారు. నిజామాబాద్ లో లోక్ సభ స్థానాన్ని బీఆర్ఎస్ భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కే అత్యధిక ఓట్లు పడ్డాయని తెలిపారు.

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ప్రయోజనాలు, ప్రాతినిధ్యం కోసం గట్టిగా పోరాడితే అసెంబ్లీ ఎన్నికల్లో పనితీరుతో సంబంధం లేకుండా గెలవవచ్చని కేటీఆర్ అన్నారు. గెలుపు ఓటములు బీఆర్ఎస్ కు కొత్త కాదని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు ఇచ్చిందని, కానీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు 420 హామీలు ఇచ్చిందని, అయితే అధికారం దక్కించుకున్న తర్వాత వాటిని విస్మరించిందని ఆయన ఆరోపించారు. ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ఎన్నికలకు ముందు యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చారని అన్నారు. కానీ తరువాత ఆ హామీ ఇవ్వలేదని చెబుతున్నారని తెలిపారు. 

బాబ్రీ మసీదుపైనే రామాలయం.. ప్రారంభోత్సవాన్ని ముస్లింలు వ్యతిరేకించాలి - ఖలిస్తానీ నేత సంచలన వ్యాఖ్యలు..

తెలంగాణలో ఇప్పటికే అమలవుతున్న అనేక సంక్షేమ పథకాలను రద్దు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రాలు, రుణ సంక్షోభం పేరుతో కొత్త సిద్ధాంతాలకు తెరలేపుతోందని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మి తదితర సంక్షేమ పథకాలను రద్దు చేసే ప్రయత్నాలను లబ్ధిదారులతో పాటు బీఆర్ఎస్ తీవ్రంగా ప్రతిఘటిస్తుందని హెచ్చరించారు. రైతు బంధు పథకం కింద రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని కాంగ్రెస్ నిలిపివేసిందని ఆరోపించారు. రాజకీయ లబ్ది కోసం ప్రజలను ఇబ్బందులకు గురిచేసేలా కాంగ్రెస్ పార్టీ వ్యూహాలు రచిస్తోందని అన్నారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios