Asianet News TeluguAsianet News Telugu

తెలంగాణలో కేజీ నుండి పీజీ వరకు ఆన్‌లైన్‌లోనే తరగతులు: సబితా ఇంద్రారెడ్డి

కరోనాను దృష్టిలో ఉంచుకొని  కేజీ నుండి పీజీ వరకు ఆన్‌లైన్ లోనే తరగతులే నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.

online classes in Telangana from July 1: minister Sabitha Indra Reddy lns
Author
Hyderabad, First Published Jun 28, 2021, 5:54 PM IST

హైదరాబాద్: కరోనాను దృష్టిలో ఉంచుకొని  కేజీ నుండి పీజీ వరకు ఆన్‌లైన్ లోనే తరగతులే నిర్వహించాలని నిర్ణయం తీసుకొన్నట్టుగా తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.సోమవారం నాడు హైద్రాబాద్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. జూలై 1వ తేదీ నుండి ఆన్‌లైన్ క్లాసులు ప్రారంభిస్తామని మంత్రి చెప్పారు. అయితే డిగ్రీ, పీజీ, డిప్లొమా పరీక్షలు యథాతథంగా నిర్వహిస్తామని మంత్రి తేల్చి చెప్పారు.కామన్ ఎంట్రెన్స్ టెస్టుల్లో ఎలాంటి మార్పులు లేవన్నారు. 

46 జీవోను ను ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు పాటించాలని మంత్రి ఆదేశించారు. ప్రతి నెలా ట్యూషన్ ఫీజును మాత్రమే  వసూలు చేయాలని మంత్రి కోరారు.టీశాట్, దూరదర్శన్ ద్వారా విద్యార్థులకు ఆన్‌లైన్ లో పాఠాలు చెబుతామని మంత్రి ప్రకటించారు. 30 శాతం ఫీజులను తగ్గించాలని విద్యా సంస్థలను కోరినట్టుగా మంత్రి తెలిపారు. 

also read:తెలంగాణ ఇంటర్ సెకండియర్ ఫలితాల విడుదల: ఫీజు చెల్లించినవారంతా పాస్

ఈ ఏడాది జూలై 1వ తేదీ నుండి విద్యా సంస్థలను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. అయితే ప్రత్యక్ష తరగతుల వైపే ప్రభుత్వం మొగ్గు చూపింది. అయితే కరోనా థర్డ్ వేవ్, డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు తదితర కారణాలతో  ప్రత్యక్ష తరగతుల కంటే  పరోక్షంగా తరగతులు నిర్వహించడమే మేలని ప్రభుత్వానికి పలువురి నుండి సూచనలు అందాయి. ఈ సూచనల మేరకు  ప్రత్యక్ష తరగతుల కంటే ఆన్‌లైన్ తరగతుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది.

Follow Us:
Download App:
  • android
  • ios