Asianet News TeluguAsianet News Telugu

నోటు దెబ్బకు ‘ఉల్లి’కి పాటు ?

  • ఉల్లి సరఫరా నిలిపేసిన ట్రాన్స్ పోర్టు యాజమాన్యాలు
  • మంత్రి హరీశ్ రావుతో జరిపిన చర్చలు విఫలం
  • వినియోగదారులు ఇబ్బంది పడకుండా ప్రభుత్వ సత్వర చర్యలు
  • యుద్దప్రతిపాదికన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన సర్కార్
onion price hike

పెద్ద నోట్ల రద్దు నిత్యావసర వస్తువుల సరఫరాపై పెను ప్రభావాన్ని చూపుతోంది. తాజాగా ట్రాన్స్ పోర్టు యాజమాన్యాలు పెద్ద నోట్ల దెబ్బకు సరుకు రవాణా నిలిపివేయడంతో ధరలు ఆకాశాన్నంటే ప్రమాదం పొంచి ఉంది. మఖ్యంగా ఉల్లి పై దీని ప్రభావం ఎక్కువగా పడే అవకాశం ఉండడంతో వినియోగదారులు ‘ఉల్లి’కి పడుతున్నారు.

 

ఈ ముప్పును ముందే గ్రహించిన ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. రాష్ట్రంలో ఉల్లి ధర ఘాటెక్కకుండ ఉండేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు ప్రారంభించింది.

 

 ఉల్లి సంక్షోభంపై మార్కెంటింగ్, గిడ్డంగుల శాఖ మంత్రి హరీశ్ రావు ఈ రోజు మధ్యాహ్నం ఉల్లి వ్యాపారులతో   చర్చలు జరిపారు. అయితే డబ్బులు చెల్లించేందుకు తమ దగ్గిర నోట్లు లేవని, అందువల్ల తాము సరఫరా దారుల నుంచి ఉల్లి కొనలేమని  వ్యాపారస్థులు తేల్చి చెప్పడంతో ఈ చర్చలు విఫలమయ్యాయి.మహారాష్ట్ర సహా ఇతర ప్రాంతాల నుంచి ఉల్లి దిగుమతికి రవాణా, హమాలీ చార్జీలు మొత్తం కలిపి లారీ కి 50 వేల రూపాయలు చెల్లించవలసి వస్తున్నదని పెద్ద నోట్ల రద్దుతో లావాదేవీలు సాధ్యం కాదని వారు చెప్పారు.

 

దీంతో ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై ప్రభుత్వం దృష్టి సారించింది. మంత్రి ఆదేశాల మేరకు అధికార యంత్రాంగం వినియోదారులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉల్లి సరఫరాకు నిశ్చయించింది.

 

అకస్మాత్తుగా ట్రాన్స్ పోర్టు యాజమాన్యాలు సరఫరా నిలిపివేసిన హైదరాబాద్ లో ఉల్లి సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని. ఈ విషయంలో వినియోగదారులు అనవసరంగా ఆందోళన పడాల్సిన అవసరం లేదని అధికారి ఒకరు వెల్లడించారు. ప్రత్యామ్నాయ  మార్గంలో  రాష్ట్రమంతా ఉల్లి సరఫరా చేసేందుకు చర్యలు  మొదలు పెట్టాలని మంత్రి ఆదేశించారని కూడా ఆయన చెప్పారు.

 

కొల్లాపూర్, ఆలంపూర్ రైతుల నుంచి కొనుగోలు చేసిన ఉల్లిని మలక్ పేట మార్కెటులోనూ, రైతు బజార్లలోనూ అందుబాటులో వుంచాలని కోరారు. రైతుల నుంచి కిలో 8 రూపాయలకు కొని వినియోగదారులకు 10 రూపాయలకు అమ్మాలని కోరారు.

 

మంత్రితో సమావేశం ముగిశాక ఏషియా నెట్ తో మాట్లాడుతూ ‘ హైదరాబాద్ కు సంబంధించి  రోజుకు 400 టన్నులు వరకు ఉల్లి డిమాండ్ ఉంటుంది. అయితే గత రెండు నెలల నుంచే ప్రభుత్వం కె.జి.కి రూ. 8 చొప్పున ఉల్లి పాయలను రైతుల నుంచి కొనుగోలు చేస్తూ వస్తున్నది. ఇప్పటికే 18 వేల టన్నుల ఉల్లి నిల్వలు సిద్ధంగా ఉన్నాయి. నెల రోజుల వరకు డిమాండ్ కు సరఫరా ఉల్లి నిల్వలు మా దగ్గర ఉన్నాయి. కాబట్టి వినియో దారులు ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు’ అని స్పష్టం చేశారు.

 

అలాగే, పెద్ద నోట్ల రద్దు, సరఫరా నిలిపివేత వల్ల వినియోగదారులు ఇబ్బంది పడకుండా నేరుగా మార్కెంటింగ్ శాఖ నుంచే ఉల్లి అమ్మకాలు చేపట్టేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios