Asianet News TeluguAsianet News Telugu

రవిప్రకాష్ కు సంబంధమే లేదు.. టీవీ9 మాజీ సీఈవోకు మరో ఎదురుదెబ్బ!

పరిస్థితులు చూస్తుంటే టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు అన్ని దారులు మూసుకుపోయేలా కనిపిస్తున్నాయి. టీవీ 9 సంస్థలో ప్రధాన వాటాదారుగా అలంద మీడియా సంస్థ ఇప్పటికే యాజమాన్య భాధ్యతలు చేపట్టింది. రవిప్రకాష్ ని సీఈవో బాధ్యతల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. 

One more shock to TV9 Ex CEO Raviprakash
Author
Hyderabad, First Published May 25, 2019, 9:41 AM IST

పరిస్థితులు చూస్తుంటే టీవీ 9 మాజీ సీఈవో రవిప్రకాష్ కు అన్ని దారులు మూసుకుపోయేలా కనిపిస్తున్నాయి. టీవీ 9 సంస్థలో ప్రధాన వాటాదారుగా అలంద మీడియా సంస్థ ఇప్పటికే యాజమాన్య భాధ్యతలు చేపట్టింది. రవిప్రకాష్ ని సీఈవో బాధ్యతల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. టీవీ 9 వాటాల బదిలీల విషయంలో సైఫ్ మారిషస్ కంపెనీ, ఐ విజన్ మీడియా మధ్య నెలకొన్న వివాదం కూడా సమసిపోయింది. ఆ రెండు సంస్థలు రాజీ కుదుర్చుకున్నాయి. దీనితో తమ వ్యవహారాల్లో రవిప్రకాష్ కు సంబంధమే లేదని జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్సీఎల్టీ ) కు వివరించాయి. 

దీనితో ఎన్సీఎల్టీ వారి వాదనతో ఏకీభవించింది. గతంలో నెలకొన్న వివాదం కారణంగా ఐ విజన్ సంస్థపై సైఫ్ మారిషస్ పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పుడు ఈ రెండు సంస్థల మధ్య రాజీ కుదరండంతో పిటిషన్ ఉపసంహరణకు అనుమతినిచ్చింది. దీనిని వ్యతిరేకిస్తున్న రవిప్రకాష్ కు ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది. రవిప్రకాష్ లేవనెత్తుతున్న అభ్యంతరాలు అలంద మీడియా, అసోసియేట్ బ్రాడ్ కాస్టింగ్ సంస్థకు మధ్య ఉన్న అంతర్గత వ్యవహారాలు. ఆ వివాదాలని ఐ విజన్, సైఫ్ మారిషస్ సంస్థల వద్ద ప్రస్తావించడానికి వీల్లేదని ఎన్సీఎల్టీ రవిప్రకాష్ కు తెలిపింది. 

ఈ వ్యవహారాల విషయంలో రవిప్రకాష్ లా ట్రిబ్యునల్ లో ఓ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ విచారణని ట్రిబ్యునల్ జూన్ 12కు వాయిదా వేసింది. ఈ మేరకు ట్రిబ్యునల్ సభ్యులు అనంత పద్మనాభ స్వామి ఆదేశాలు జరీ చేశారు. గతంలో ఐ విజన్, సైఫ్ మారిషస్ సంస్థల మధ్య వాటాల ఒప్పందం జరిగింది. ఈ విషయంలో ఐ విజన్ సంస్థ నిబంధనల మేరకు నడుకోవడం లేదని సైఫ్ మారిషస్ ట్రిబ్యునల్ లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వివాదంలోకి రవి ప్రకాష్ కూడా ఎంటర్ అయ్యారు. 

వాటాల బదిలీకి అనుమతి ఇవ్వవద్దని ట్రిబ్యునల్ ని కోరారు. రవిప్రకాష్ లావాదేవీల విషయంలో ఎలాంటి సంబంధం లేదు. అలాంటిది తమ మధ్య వ్యవహారాల్లో ఆయన ఎలా జోక్యం చేసుకుంటారు అని సైఫ్ మారిషస్, రివిజన్, ఎబిసిఎల్ మూడు సంస్థలు ట్రిబ్యునల్ వద్ద వాదనలు వినిపించాయి. వారి వాదనలతో ట్రిబ్యునల్ ఏకీభవించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios