తెలంగాణ ఐటి రంగానికి మరో గుడ్ న్యూస్

one more good news for hyderabad it people
Highlights

  • హైదరాబాద్ కు రానున్న అడోబ్ సంస్థ
  • అడోబ్ ఛైర్మన్ తో కేటిఆర్ భేటీ

ఐటీ దిగ్గజం అడోబ్ చైర్మన్ & సి.ఈ.ఓ శంతను నారాయణ్ తో మంత్రి కేటీఆర్ సోమవారం సమావేశమయ్యారు. ప్రపంచవ్యాప్తంగా 17000 మంది ఉద్యోగులు కలిగిన అడోబ్ సంస్థ త్వరలో హైదరాబాద్ లో కాలు మోపనుంది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సందర్భంగా ఐటీ దిగ్గజం అడోబ్ చైర్మన్ & సి.ఈ.ఓ శంతను నారాయణ్ తో మంత్రి కేటీఆర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో అడోబ్ కేంద్రాన్ని నెలకొల్పాల్సిందిగా మంత్రి కేటీఆర్ కోరారు. 2015 మే నెలలో శాన్ ఫ్రాన్సిస్కో నగరంలో శంతను నారాయన్ తో తొలిసారి సమావెశమైన మంత్రి కేటీఆర్, ఆ తరువాత పలుసార్లు ఆయనను కలిశారు. కలిసిన ప్రతిసారి ఆయన హైదరాబాదులో అడోబ్ కార్యకలాపాలను విస్తరించాల్సిందిగా శంతనును కోరిన విషయాన్ని ఈ రోజు సమావేశంలో గుర్తుచేశారు.

మంత్రి ప్రతిపాదనకు స్పందించిన శంతను నారాయణ్ అడోబ్ కంపెనీ విస్తరణ ప్రణాళికల్లో హైదరాబాదుకు ప్రత్యేక స్థానం ఇస్తున్న విషయం తెలియజేశారు. త్వరలోనే అడోబ్ సంస్థ తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కేంద్రాన్ని తెలంగాణ రాజధాని హైదరాబాదులో నెలకొల్పుతామని తెలిపారు. గత మూడున్నరేండ్లలో హైదరాబాదు నగరంలో ఐటీ రంగం గణనీయమైన ప్రగతి సాధించిందని, నూతన టెక్నాలజీలపై ఇక్కడ సుశిక్షితులైన యువతరం లభ్యత ఉందని శంతను అభిప్రాయపడ్డారు.  త్వరలోనే అడోబ్ కేంద్రానికి సంబంధించిన పెట్టుబడి, ఉద్యోగ అవకాశాలు, సంస్థ విస్తరణ వంటి అంశాలపై సంస్థ తరుఫున ఒక ప్రకటన చేస్తామని మంత్రికి తెలిపారు.

ఈ నిర్ణయం పట్ల మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చెశారు. అడోబ్ సంస్థకు అవసరమైన అన్ని రకాల సహకారం అందిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ ఫైబర్ గ్రిడ్ ఫలితాలను తెలిపే పైలట్ ప్రాజెక్టు టెక్నాలజీ డెమాన్స్ట్రేషన్ నెట్వర్క్ ను కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఈరోజు ప్రారంభించారు.

నెట్వర్క్ ప్రారంభించిన అనంతరం కేంద్ర మంత్రి ' కంగ్రాట్స్, కీప్ ఇట్ అప్ కెటియార్ ' అంటూ మంత్రి కెటి రామరావుకు అభినందన సందేశాన్ని తెలిపారు.  మహేశ్వరంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో నెలకొల్పిన ఈ-క్లాస్ రూంలో ఉన్న విద్యార్దులతో మంత్రి సంభాషించారు. మనసాన్ పల్లి ప్రాథమిక అరొగ్య కేంద్రంలో ఉన్న ఒక రొగికి హైదరాబాద్ లో ఉన్న డాక్టర్ టిఫైబర్  ద్వారా అందించిన టెలి మెడిసిన్ సేవలను పరిశీలించారు. తుమ్మలూరు గ్రామంలో నెలకొల్పిన అత్యాధునిక కియోస్క్ ద్వారా గ్రామస్ధులకు అవసరం అయిన ప్రభుత్వ సేవలను విడియో కాన్ఫరెన్సు సదుపాయం, వ్యవసాయ సమాచారం అందించడాన్ని మంత్రి తిలకించారు. తెలంంగాణ ప్రభుత్వం చేపట్టిన టి-ఫైబర్ ప్రాజెక్టు తీసుకురానున్న టెక్నాలజీ ఫలితాలు, వాటి ద్వారా ప్రజలకు అదే ఫలితాలను తెలుసుకున్న మంత్రి అభినందనలు తెలిపారు.

మహేశ్వరం మండంలోని నాలుగు గ్రామాల్లోని ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాలను సచివాలయం, ప్రగతి భవన్, రాజ్ భవన్, స్టెట్ డాటా సెంటర్లకు అనుసంధానం చేశారు.  తెలంగాణ టి-ఫైబర్ ద్వారా ఎలాంటి సేవలు, సౌకర్యాలు అందుతాయో ఈ సందర్భంగా కేంద్ర మంత్రికి చూపించారు. ఈ నెట్వర్క్ ద్వారా పౌరులకు ప్రభుత్వ సేవలు, (ఈసేవా)  ఐపి టివి, టెలిఫొన్ , టెలి మెడిసిన్, ఈ ఎడ్యూకేషన్, వంటి టెక్నాలజీ ఫలాలు ప్రతి ఇంటికి అందుతాయని కేంద్ర మంత్రికి కెటి రామారావు తెలిపారు. ప్రస్తుతానికి ప్రతి గృహానికి వన్ జిబి పియస్ ఇంటర్నెట్ సేవలు అందించే సామర్ద్యం ఈ నెట్ వర్క్ కున్నదని తెలిపారు. ప్రారంభొత్సవం సందర్భంగా ఫైబర్ గ్రిడ్ ద్వారా కలిగే ఫలాలను నేరుగా వీక్షించిన మంత్రులు, అక్కడ ఏర్పాటు చేసిన ఇతర సేవలను ఫైబర్ గ్రిడ్ ఎండీ సుజయ్ కారంపురిని అడిగి తెలుసుకున్నారు.

వరల్డ్ ఐటి కాంగ్రెస్ లో భాగంగా  మంత్రి కెటి రామరావు పలువురు ప్రముఖులతో సమావేశం అయ్యారు. ఉదయం  "రితింకింగ్ గవర్నెన్సు ఇన్ డిజిటల్ ఎకానమీ" అనే అంశంపైన జరిగిన రౌండు టెబుల్ సమావేశంలో పలు దేశాల ఐటి శాఖా మంత్రులతో కలిసి పాల్గోన్నారు. నాస్కామ్ మాజీ చైర్మన్ బివిఅర్ మోహాన్ రెడ్డి ప్రయోక్తగా వ్యవహరించిన ఈ సమావేశంలో కేంద్ర ఐటి శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ తోపాటు,  బంగ్లాదేశ్  ఐటి శాఖ మంత్రి జునైద్ అహ్మద్ పాలక్, హరీన్ ఫెర్నాండో- శ్రీలంక,  వాహన్ మార్టీరోస్యన్-అర్మేనియా,  ఆబ్దుర్ రహీమ్ - నైజీరీయా దేశాల ఐటి శాఖ మంత్రులు ఈ సమావేశంలో పాల్గోన్నారు. సమావేవంలో పాల్గోన్న కేంద్ర మంత్రికి కేంద్ర స్ధాయిలో తీసుకోవాల్సిన పలు అంశాలపైన పలు సలహాలు ఇచ్చారు. రాష్టాలన్నింటిని కలుపుకుని  కోపరేటివ్ డిజిట్ ఫ్లాట్ ఫాం  ఒకదాన్ని ఎర్పాటు చేయాని దీని ద్వారా దేశంలో డిజిటల్ అసమానతలు తగ్గుతాయన్నారు. మంత్రి సలహాను పరిశీలించి, కార్యచరణతో ముందుకు వస్తామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.

loader