విద్యార్ధుల మధ్య చోటు చేసుకున్న ఘర్షణలో ఒక ప్రాణాన్ని బలి తీసుకుంది. హైదరాబాద్ యూసుఫ్‌గూడ పరిధిలోని శ్రీకృష్ణానగర్‌లోని స్థానిక సాయి కృపా స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
హైదరాబాద్ (hyderabad) యూసుఫ్‌గూడ (yousafguda) పరిధిలోని శ్రీకృష్ణానగర్‌లో (srikrishna nagar) దారుణం చోటు చేసుకుంది. స్థానిక సాయి కృపా స్కూల్‌లో పదో తరగతి చదువుతున్న విద్యార్ధుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ ఘటనలో మన్సూర్ అనే విద్యార్ధికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో చిన్నారిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. స్కూల్‌లో క్రికెట్ ఆడుతుండగా విద్యార్ధుల మధ్య గొడవ జరిగినట్లుగా సీసీటీవీ ఫుటేజ్‌లో తేలింది. బౌలింగ్ సరిగా వేయలేదంటూ విద్యార్ధుల గొడవపడ్డారు. ఈ క్రమంలోనే వాటర్ బాటిళ్లతో మన్సూర్‌పై దాడి చేశారు తోటి విద్యార్ధులు. ఈ ఘటనలో క్లాస్ రూంలోనే కిందపడిపోయాడు మన్సూర్.
