వేగంగా వెళుతున్న ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చేలరేగి ప్రయాణికులు చిక్కుకున్న దుర్ఘటన నల్గొండ జిల్లాలో చోటుచేసుకుంది. 

నల్గొండ జిల్లా మర్రిగూడ వద్ద ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ ట్రావెల్స్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

హైదరాబాద్ నుండి నెల్లూరుకు 38 మంది ప్రయాణికులతో శ్రీకృష్ణ ట్రావెల్స్ బస్సు గత రాత్రి బయలుదేరింది. అయితేే ప్రయాణికులంతా మంచి నిద్రలో వుండగా బస్సులో మంటలు చెలరేగాయి. దీంతో వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును రోడ్డుపక్కన నిలిపి ప్రయాణికులను హెచ్చరించాడు. అయితే అప్పటికే మంటలు చుట్టుముట్టడంతో కొందరు ప్రయాణికులు అందులో చిక్కుకున్నారు. వీరిలో ఒకరు మంటల్లో సజీవదహనం కాగా మిగతావారు తీవ్రంగా గాయపడ్డా ఎలాగోలా ప్రాణాలతో బయటపడ్డారు.

బస్సులో షాట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు స్పందించారు. మంటలను ఆర్పేందుకు ప్రయత్నించడంతో పాటు గాయపడినవారిని హాస్పిటల్ కు తరలించారు. సమయానికి చికిత్స అందడంతో క్షతగాత్రులకు ప్రాణాపాయం తప్పింది.