సంగారెడ్డి జిల్లాలోని ఐరన్ ఫ్యాక్టరీలో పేలుడు: ఒకరు మృతి
సంగారెడ్డి జిల్లాలోని ఐటీడీఏ బొల్లారం మీనాక్షి ఐరన్ ఫ్యాక్టరీలో బుధవారం నాడు పేలుడు చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఒకరు మరణించారు.
సంగారెడ్డి: Sanga Reddyజిల్లాలోని Jinnaram మండలం IDA బొల్లారం Meenakshi ఐరన్ ఫ్యాక్టరీలో బుధవారం నాడు ఉదయం పేలేడు చోటు చేసుకొంది.ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు.,
ఈ ఫ్యాక్టరీలోని ఫర్మాస్ వద్ద ఇవాళ పేలుడు చోటు చేసుకొందని పోలీసులు చెప్పారు.ఈ పేలుడులో హేమంత్ అనే కార్మికుడు మరణించాడు. అజయ్ కుమార్, లాల్ బీహార్ కుమార్, అక్షయ్ కమార్ గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం హైద్రాబాద్ లో ఆసుపత్రికి తరలించినట్టుగా పోలీసులు చెప్పారు. క్షతగాత్రులంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల కాలంలో పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటు చేసుకొంటున్నాయి. ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు ఆయా ఫ్యాక్టరీల్లో సేఫ్టీ చర్యలు తీసుకోవాలనే నిబంధనలను పట్టించుకోవడం లేదు. ఏదైనా ప్రమాదాలు జరిగిన సమయంలో అధికారులు హాడావుడి చేస్తున్నారు. ఆ తర్వాత ఫ్యాక్టరీల్లో రక్షణ చర్యల గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు విన్పిస్తున్నాయి.
ఈ ఏడాది ఏప్రిల్ 25న జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ లో సోమవారం నాడు బ్లాస్ట్ చోటు చేసుకొంది. ఈ ఘటనలో ఏడుగురు కార్మికులకు గాయాలయ్యాయి. గాయపడిన కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. 500 మెగావాట్ల పవర్ ప్లాంట్ లో ఈ పేలుడు చోటు చేసుకొంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ఘణపురం మండలం చేల్పూరు లో గల ఎన్టీపీసీలో పేలుడు చోటు చేసుకొంది.
కాకతీయ థర్మల్ పవర్ ప్లాంట్ లోని ఒకటో యూనిట్ లో మిల్లర్ పేలి ఒక్కసారిగా మంటలు వ్యాపించినట్టుగా అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు గాయపడ్డారని, వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు తెలిపారు.గాయపడిన వారిని మెరుగైన చికిత్స కోసం ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.
ఏపీ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలోని ఫోరస్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలి ఆరుగరు కార్మికులు మరణించారు. ఈ ఘటన ఈ ఏడాది ఏప్రిల్ 14న జరిగింది. ఈ ఫ్యాక్టరీని మూసివేయాలని స్థానికులు ఆందోళన నిర్వహించారు. ఈ ఫ్యాక్టరీని ఇక్కడి నుండి తరలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.