ముషీరాబాద్ లో పేలుడు కలకలం రేపింది. చెత్తకుప్పలో పడేసిన ఓ కెమికల్ డబ్బా పెద్ద శబ్ధంతో పేలింది. ఈ ఘటనలో నాగయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయడపడ్డాడు. అతని ఒక చెయ్యిలోని కొంత బాగం తెగి పడిపోయింది. తీవ్రగాయాలపాలైన ఆయనను చికిత్స నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. స్థానికులు సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలికి  చేరుకొని పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

Also Read కులాంతర వివాహం.. పుట్టింటికి వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో....

ఇదిలా ఉండగా.. ముషీరాబాద్ లో గత రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ముషీరాబాద్ లోని మారుతీ కార్ల షోరూంలో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో దాదాపు 7కార్లు పూర్తిగా మంటల్లో కాలి బూడిదయ్యాయి. కాగా.. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలు అదుపుచేశాయి. నాలుగు ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలు అదుపు చేసినట్లు అధికారులు చెప్పారు. కాగా.. విద్యుత్ షార్ట్ సర్య్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానిస్తున్నారు.