ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించాడు. పెద్దలను ఎదురించి మరీ కులాంతర వివాహం చేసుకున్నాడు. అన్యోన్యంగా సాగుతున్న వారి దాంపత్య జీవితం అనుకోకుండా చెల్లాచెదురైంది. పుట్టింటికి వెళ్లివస్తానని చెప్పిన భార్య తిరిగి తన దగ్గరకు రాలేదు. వాళ్లవాళ్లు చెప్పిన మాటలు నమ్మి.. భార్య తనను దూరం చేసుకుంది. ఉన్నపళంగా భార్య దూరం కావడం అతను తట్టుకోలేకపోయాడు. దీంతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈసంఘటన రాయదుర్గం లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... రాయదుర్గానికి చెందిన నరేందర్(28) ఓ ఎలక్ట్రీషియన్ కు అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. నాలుగేళ్ల క్రితం ఓ యువతిని ప్రేమించి కులాంతర వివాహం చేసుకున్నాడు. భార్యభర్తలు అన్యోన్యంగా ఉండేవారు. నాలుగు నెలల క్రితం ఆమె పుట్టింటికి వెళ్లింది.

Also Read పెళ్లికి కట్నకానుకలు: హైద్రాబాద్‌లో ఇద్దరు యువతుల సూసైడ్...

కొద్ది రోజులు ఉండివస్తానని వెళ్లిన భార్య తిరిగి రాకపోవడంతో మనస్థాపానికి గురయ్యాడు. తన భార్యను తన దగ్గరకు తెచ్చుకుందామని వెళ్లాడు. కానీ ఆమె తిరిగి అతని వెంట రాలేదు. కాగా.. పెద్ద గొడవ జరిగింది. దీంతో.. తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. ఇంటికి వెళ్లి తన ఫోన్ లో ఫేస్ బుక్ లో సెల్ఫీ వీడియో తీసుకున్నాడు. భార్య లేకుండా తాను జీవించలేనంటూ అందులో చెప్పాడు.

అనంతరం ఘట్ కేసర్-బీబీనగర్ రైల్వేస్టేషన్ల మధ్య రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. కాగా అతను మృతిపట్ల కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.