జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో విషాదం చోటుచేసుకుంది.  విషం కలిసిన టీ తాగి ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం రామచంద్రాపురంలో విషాదం చోటుచేసుకుంది. విషం కలిసిన టీ తాగి ఒక మహిళ మృతి చెందగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. 

ఎండ్రిన్‌ గుళికలను టీ పొడి అనుకుని దాంతో అంజమ్మ అనే మహిళ టీ కాచింది. ఈ టీని అంజమ్మతో పాటు భర్త మల్లయ్య, మరిది భిక్షపతి తాగారు. కాగా టీ తాగిన వెంటనే అంజమ్మ మృతి చెందగా, అంజమ్మ భర్త మల్లయ్య, మరిది భిక్షపతి పరిస్థితి విషమంగా ఉంది.