తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గాంధీ ఆసుపత్రిల ఖైదీల పరారీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. పారిపోయిన నలుగురు ఖైదీలలో ఒకరిని అదుపులోకి తీసుకున్నారు బాలానగర్ పోలీసులు.

ఖైదీ సోమ సుందర్ నుంచి 9 బైకులు స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన ఖైదీల నుంచి పోలీసులు గాలిస్తున్నారు. ఆ ముగ్గురు ఖైదీలు గుల్బర్గాలో ఉన్నట్లు గుర్తించింది. దీంతో పోలీసుల బృందం కర్ణాటకకు వెళ్లింది.

చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్న నలుగురు ఖైదీలకు కరోనా సోకడంతో ఆగస్టు 27న వారిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ సమయంలో వారు పోలీసులు, వైద్య సిబ్బంది కళ్లుగప్పి ఆసుపత్రి నుంచి పరారయ్యారు.