Asianet News TeluguAsianet News Telugu

Omicron : హైదరాబాద్ లో పలు ప్రాంతాల్లో మళ్లీ ఆంక్షలు.. అవేంటంటే...

వైరస్ hotspot లుగా మారిన జియాగూడ, మేకలమండి, మలక్ పేట గంజ్, బేగం బజార్, పాతబస్తీ, మలక్ పేట్, బేగంపేట్, మాదన్నపేట, గుడి మల్కాపూర్, సరూర్ నగర్ మార్కెట్లపై మళ్లీ ఆంక్షలు విధించింది. కొనుగోలు దారులు భౌతిక దూరం పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. 

Omicron effect : restrictions in hotspots again in hyderabad
Author
Hyderabad, First Published Dec 4, 2021, 1:22 PM IST

హైదరాబాద్ : కరోనా కొత్త variant కు వేగంగా విస్తరించే గుణం ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమయ్యింది. ఇప్పటికే చారిత్ర tankbund సహా చార్మినార్ ల వద్ద ‘ఫన్ డే’ వేడుకలను రద్దు చేసింది. సందర్శకులపైనే కాకుండా సాధారణ ప్రజలపై కూడా ఆంక్షలు విధించింది. ప్రతీ ఒక్కరూ mask ను విధిగా వాడాలనే ఆదేశాలను ఖచ్చితం చేసింది. 

దీంతోపాటు వైరస్ hotspot లుగా మారిన జియాగూడ, మేకలమండి, మలక్ పేట గంజ్, బేగం బజార్, పాతబస్తీ, మలక్ పేట్, బేగంపేట్, మాదన్నపేట, గుడి మల్కాపూర్, సరూర్ నగర్ మార్కెట్లపై మళ్లీ ఆంక్షలు విధించింది. కొనుగోలు దారులు భౌతిక దూరం పాటించాలని, నిబంధనలను ఉల్లంఘించిన వ్యాపారులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. 

దీంతోపాటు.. తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌పంచ దేశాల్లో ఒమ్రికాన్ విస్త‌ర‌ణ‌, కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల నేప‌థ్యంలో అలెర్ట్ అయ్యింది. ఒక వేళ కొత్త వేరియంట్ రాష్ట్రంలోకి వ‌స్తే దానిని ఎదుర్కొవడానికి, క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన అన్ని చ‌ర్య‌ల‌ను తీసుకుంటోంది. అందులో భాగంగా వెంటిలేటేడ్ బెడ్స్‌, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్స్‌ను సిద్ధంగా ఉంచుకున్నారు. 

ప్ర‌స్తుతం తెలంగాణ రాష్ట్రంలో రోజుకు దాదాపు 140 నుంచి 150 కేసులు న‌మోద‌వుతున్నాయి. అయితే ఇవ‌న్నీ డెల్టా ర‌కానికి చెందినవి. అయితే ఇటీవ‌ల బ్రిట‌న్ నుంచి వ‌చ్చిన ఒక మ‌హిళ‌ల‌కు క‌రోనా నిర్ధార‌ణ అయ్యింది. అయితే ముంద‌స్తు చ‌ర్య‌ల్లో భాగంగా ఆమె నుంచి సేక‌రించిన న‌మూనాల‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించి, ఫ‌లితాల కోసం ఎదురుచూస్తున్నారు. 

తెలంగాణలో కొత్త వేరియంట్ ప్ర‌వేశిస్తే, దాని చికిత్స కోసం అధికారులు ఏర్పాట్లు చేశారు. టిమ్స్‌లో 25 వెంటిలేటెడ్ బెడ్స్‌, 175 ఆక్సిజ‌న్ బెడ్స్ ఏర్పాటు చేశారు. అలాగే గాంధీ హాస్పిట‌ల్ లో 100 బెడ్స్‌ను సిద్ధంగా ఉంచారు. అలాగే మ‌రికొన్ని హాస్పిట‌ల్స్‌లో ఐసీయూ వార్డుల‌, ఆక్సిజ‌న్ సిలెండర్స్‌, వెంటిలేట‌ర్ బెడ్స్ సిద్దంగా ఉంచాల‌ని ఆదేశించారు. కొత్త వేరియంట్ నేప‌థ్యంలో అధికారులు ఎప్ప‌టిక‌ప్పుడు స‌మీక్ష‌లు జ‌రుపుకుంటున్నారు. 

Omicron : తెలంగాణ ఒమిక్రాన్ వేరియంట్ బులెటిన్ ఇదే.. ఎంతమంది విదేశీయులు వచ్చారంటే..?

ఇక రిస్క్ దేశాల నుంచి వ‌చ్చే వారికి ఆర్టీపీసీఆర్‌ ప‌రీక్ష‌లు తప్పనిసరి చేసింది. కొత్త వేరియంట్ బ‌య‌ట‌పడిన దేశాల నుంచి తెలంగాణ‌కు వ‌చ్చే వారంద‌రికీ విమానాశ్ర‌యంలోనే ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఐదేళ్లు పైబ‌డిన వారంద‌రికీ ఈ టెస్ట్ త‌ప్ప‌నిస‌రి చేశారు. ఇందులో పాజిటివ్‌గా నిర్ధారించ‌బ‌డిన వారంద‌రినీ క్వారంటైన్‌కు పంపించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. రిస్క్ దేశాల నుంచి కాకుండా ఇత‌ర దేశాల నుంచి వ‌చ్చిన వారికి కూడా థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వ‌హిస్తున్నారు. 

ఆర్టీపీసీఆర్ టెస్ట్‌లో, అలాగే థ‌ర్మ‌ల్ స్క్రీనింగ్ టెస్ట్‌లో నెగిటివ్ వ‌చ్చిన‌ప్ప‌టికీ వారంద‌రూ క్వారంటైన్‌లో ఉండాల‌ని అధికారులు సూచిస్తున్నారు. రిస్క్ లేని దేశాల నుంచి వ‌చ్చే వారిలో కూడా అనుమానితుల‌ను గుర్తించి వారికి ఆర్టీపీసీఆర్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్నారు. ఎవ‌రికైనా పాజిటివ్ వ‌స్తే ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన హాస్పిట‌ల్స్‌కు తీసుకెళ్ల‌నున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios