ఈ నెల 13వ తేదీ సోమవారం ఇంట్లో ఎవ్వరూలేని సమయంలో ఒంటరిగా ఉన్న యువతికి లాకవత్ దేవ్లా.. చాక్లెట్, డబ్బులు ఆశ చూపి ఇంట్లోకి రప్పించుకున్నాడు. ఆ తరువాత ఆ అమాయకురాలి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఖమ్మం : మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఓ యువతికి Chocolate ఆశ చూపి అత్యాచారం చేశాడో కీచకుడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలానికి చెందిన Mental disability కలిగిన 22 యేళ్ల యువతి మీద అదే గ్రామానికి చెందిన 58 సంవత్సరాల లాకావత్ దేవ్లా Sexual assault చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాధితురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 13వ తేదీ సోమవారం ఇంట్లో ఎవ్వరూలేని సమయంలో ఒంటరిగా ఉన్న యువతికి లాకవత్ దేవ్లా.. చాక్లెట్, డబ్బులు ఆశ చూపి ఇంట్లోకి రప్పించుకున్నాడు. ఆ తరువాత ఆ అమాయకురాలి మీద లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ క్రమంలో ఆమె ఏడవడంతో గమనించిన చుట్టుపక్కలవారు.. ఇంట్లోకి వచ్చారు. వారిని చూసి దేవ్లా పరారయ్యాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఇల్లెందు ఎష్ఐ కుమారస్వామి వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. లైంగిక దాడికి పాల్పడిన దేవ్లా పరారీలో ఉన్నాడు.
బస్సు గుద్దేస్తుందనే భయంతో బ్రిడ్జిమీదినుంచి దూకిన చిన్నారి.. కాళ్లు విరిగి...
ఇదిలా ఉండగా, గత అక్టోబర్ లో ఆరేళ్ల గిరిజన బాలిక మీద ఓ గ్రామ సర్పంచి భర్త, అధికార పార్టీ నేత లైంగిక దాడికి పాల్పడటం ఉద్రిక్తతకు దారి తీసింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలో అక్టోబర్ 30న ఈ ఘటన జరిగింది.
బాధిత కుటుంబీకులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలో ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న మహిళ ఎల్లారెడ్డిపేట మండలంలోని ఓ Village Sarpanch ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఆమె భర్త ఓ ప్రైవేటు సంస్థలో పనిచేస్తూ రెండు రోజులకు ఒకసారి ఇంటికి వస్తుంటాడు.
వీరికి ఓ కుమార్తె (6), ఓ కుమారుడు, రెండో తరగతి చదువుతున్న బాలిక గురువారం బడికి వెళ్లలేదు. చిన్నారి తల్లి విధులకు వెళ్తూ బాలికను సర్పంచి ఇంట్లో వదిలివెళ్లారు. సర్పంచి భర్త ఇంట్లో ఎవరూ లేని సమయంలో Chocolate ఆశ చూపి చిన్నారి మీద అఘాయిత్యానికి ఒడిగట్టాడు. చిన్నారిని rape చేశాడు.విధులు ముగించుకుని సాయంత్రం ఇంటికొచ్చిన మహిళ.. కుమార్తె తీవ్ర అస్వస్థతకు గురైనట్టు గుర్తించి ఆరా తీసింది. జరిగిన దారుణాన్ని తెలుసుకుని భర్తకు సమాచారమిచ్చింది.
అనంతరం ఇద్దరూ ఈ విషయమై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని నిలదీశారు. ఆయన తప్పు అంగీకరించకపోగా, వారిని వాళ్ల ఇంట్లోనే బంధించి ఇంటికి lock వేశాడు. సమాచారం తెలుసుకున్న బంధువులు శుక్రవారం ఉదయాన్నే గ్రామానికి చేరుకుని తాళాలు పగులగొట్టి బాధితులను బయటకు తీసుకొచ్చారు. పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించి పారిపోయేందుకు యత్నించిన accused కారు మీద దాడి చేశారు. ఆ తరువాత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
బాధితుల ధర్నా, ఉద్రిక్తం..
బాధిత కుటుంబానికి మద్దతుగా భారీ సంఖ్యలో జనం Ellareddypetaలోని ప్రధాన రహదారిమీద బైఠాయించారు. నిందితుడిని అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు. వీరికి స్వేరోస్, అఖిల భారత బంజారా సంఘం, లంబాడి హక్కుల పోరాట సమితి, లంబాడి ఐక్య వేదిక, భాజపా, కాంగ్రెస్ నాయకులు మద్ధతు తెలిపారు.
