పిల్లలను ట్యూషన్‌కు తెస్తూ.. టీచర్‌ వెంటపడ్డ వృద్ధుడు

Old man Harrasments on school teacher at old city hyderabad
Highlights

పిల్లలను ట్యూషన్‌కు తెస్తూ.. టీచర్‌ వెంటపడ్డ వృద్ధుడు

తన పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిస్తున్న టీచర్‌పై కన్నేసి వయసును కూడా మరచిపోయి.. ఆమెను వేధింపులకు గురిచేశాడో తండ్రి.. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన ఓ మహిళ తన ఇంటికి సమీపంలోని ఓ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తూ.. ఇంటి వద్ద ట్యూషన్లు చెప్పేది.. పాతబస్తీకే చెందిన ఉస్మాన్ (52)అనే వ్యక్తి తన ముగ్గురు పిల్లలను ట్యూషన్‌లో చేర్పించి.. రోజు ఇంటి నుంచి తీసుకువచ్చి... తీసుకువెళ్లేవాడు..

ఈ క్రమంలో ఆ కామాంధుడి కన్ను టీచర్‌పై పడింది.. పిల్లలను తీసుకువచ్చే సమయంలో ఏదో వంకతో ఆమెతో మాట్లాడేవాడు.. ఇది చివరకు లైంగిక వేధింపుల వరకకు వెళ్లింది.. ఓ దశలో శృతిమించడంతో బాధితురాలు ఉద్యోగం మానేయడంతో పాటు అతని పిల్లలకు ట్యూషన్ చెప్పడాన్ని విరమించుకుంది... అయినప్పటికీ అతని వైఖరిలో ఏ మార్పు లేదు... రెండేళ్లపాటు ఆ కామాంధుడి వేధింపుల భరించి ఇక ఓపిక నశించి ఇటీవల షీ-టీమ్స్‌కు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పక్కా ఆధారాలతో ఉస్మాన్‌ను అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు.

loader