మటన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగింది. 

అదృష్టం బాగా లేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది అనే సామెత వినే ఉంటారు. అరటి పండు తింటే పన్ను విరుగుతుందో? లేదో 
తెలియదు కానీ.. ఓ మటన్ ముక్క మాత్రం ఓ నిండు ప్రాణాన్ని తీసింది. మటన్(mutton) ముక్కెంటీ? మనిషి ప్రాణాలు తీయడమేంటని అనుకుంటారా..? ఓ మటన్ ముక్క వృద్ధుడి పాలిట మృత్యుదేవత అయ్యింది. ఓ వృద్ధుడు భోజనం చేసే సమయంలో మటన్ ముక్క గొంతులో ఇరుక్కొని ఊహిరాడక మృతి చెందాడు. ఈ విషాదకర ఘటన మహబూబాబాద్ జిల్లాలో కోనాపురంలో చోటుచేసుకుంది. 

వివ‌రాల‌లోకి వెళితే.. మహబూబ్‌నగర్ జిల్లా కోనాపురానికి చెందిన కుంజ ముత్తయ్య అనే వృద్ధుడు గురువారం నాడు తన కుమారుడితో కలిసి మటన్ కూరతో భోజనం చేశాడు. తింటున్న క్రమంలో ఓ మటన్ ముక్క ముత్తయ్య గొంతులో ఇరుక్కుపోయింది. దీంతో.. ఆ వృద్ధుడు ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. ఎన్ని నీళ్లు తాగినా ఆ మటన్ ముక్క గొంతులో నుంచి బ‌యట‌కు రాలేదు.. లోప‌లికి పోలేదు. దీంతో ఆ వృద్ధుడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఊపిరాడక ముత్తయ్య చనిపోయిన‌ట్లు వైద్యులు ప్ర‌క‌టించారు.. ముత్తయ్య మరణంతో అతని కుటుంబం విషాదం చోటు చేసుకుంది.

గతంలో ఇదే జిల్లాలో ఓ వ్యక్తి చికెన్ ముక్క గొంతులో ఇరుక్కుని చనిపోయాడు. బాలానగర్‌ మండలంలోని ఉడిత్యాల గ్రామానికి చెందిన పోచయ్య గౌడ్‌ (42)అనే వ్యక్తి చికెన్‌ తింటుండగా ప్రమాదవశాత్తు ఓ చికెన్ ముక్క ఆయన గొంతులో ఇరుక్కుపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే పోచయ్యను ఆసుపత్రికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయింది. ఊపిరాడక గిలగిలా కొట్టుకున్న పోచయ్య గౌడ్‌ అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు.