వరంగల్ లో భారీ వర్షానికి పాత భవనం కూలి, ఇద్దరు మృతి...
వరంగల్ లో భారీ వర్షానికి ఓ పాత భవనం కూలిపోయింది. ఇందులోని ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరొకరికి గాయాలయ్యాయి.
వరంగల్ : రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ కురుస్తున్న heavy rain కారణంగా పలుచోట్ల ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారీ వర్షాల కారణంగా Warangalలోని మండి బజార్ లో పాత భవనం కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు రెస్క్యూ టీం తో అక్కడికి చేరుకున్నారు. భవన శిధిలాల నుంచి వారిని వెలికితీసి..వెంటనే ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిశీలిస్తున్నారు. వర్షాలవల్ల ఇలాంటి ప్రమాదాలు జరగకుండా మరింత అప్రమత్తంగా ఉండాలని నగర ప్రజలకు సూచించారు.
ఇదిలా ఉండగా, హైదరాబాద్ లోనూ భారీగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం, శనివారం హైదరాబాద్ నగరానికి భారీ వర్ష సూచన ఉన్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు పలు సూచనలు చేశారు. వర్షం నిలిచిన వెంనే రోడ్ల మీదికి రావొద్దని సూచించారు. కార్యాలయాలు, వ్యాపార, వాణిజ్య సముదాయాలు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాలని కోరారు. వర్షం నిలిచిన వెంటనే హడావుడిగా రోడ్ల మీదికి రాకుండా గంట తరువాత రావాలని సూచించారు. భారీ వర్షాలతో నగరంలోని రోడ్ మీదికి చేరిన నీరు బైటికి వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతుందన్నారు. ఈ సూచనలు పాటించకపోతే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయే అవకాశం ఉంటుందని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.
మహబూబాబాద్ జిల్లా: వరదలో చిక్కుకున్న స్కూల్ బస్సు... అందులో 16 మంది పిల్లలు
ఇదిలా ఉండగా, శుక్రవారం ఉదయం నుంచి హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తుంది. దీంతో లోతట్టు ప్రాంతాల ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వాధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో నేడు, రేపు రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తెలంగాణలో రుతుపవనాలు ప్రవేశించిన రోజు నుండి వర్షాలు ప్రారంభమయ్యాయి. ఎడతెరిపి లేకుండా వర్షాలు కురిశాయి. అయితే, మధ్యలో కొన్నిరోజుల పాటు.. వర్షాలు కొంత తెరిపినిచ్చాయి. ఆ తరువాత మళ్లీ ప్రారంభమైన వర్షాలు దాదాపు వారం రోజులకు పైగా తెలంగాణ వ్యాప్తంగా విస్తారంగా కురిశాయి. ఇక బంజారాహిల్స్, ఎల్ బీ నగర్, దిల్ సుఖ్ నగర్, హయత్ నగర్, కొత్తపేట,జూబ్లీహిల్స్, లింగంపల్లి, టోలిచౌకి, మణికొండ, ఉప్పల్, అంబర్ పేట, రామంతాపూర్, బోయిన్ పల్లి, బేగంపేట, సికింద్రాబాద్, కొండాపూర్, గచ్చిబౌలి, మాదాపూర్, ఖైరతాబాద్, ఆబిడ్స్, నాంపల్లి, కోఠి, బషీర్ బాగ్ తదితర ప్రాంతాల్లో వర్షం కురుస్తుంది.
వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులు ఎదురవ్వకుండా.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇప్పటికే పలుప్రాంతాల్లో వర్షం నీరు భారీగా వచ్చి చేరుతుంది. ఈ కారణంగా రోడ్లపై వర్షం నీరు భారీగా ప్రవహిస్తుంది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం నుండి కురుస్తున్న వర్షం కారణంగా అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాలను హెచ్చరించారు అధికారులు.
అల్పపీడన ప్రభావం కారణంగా తెలంగాణలో ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.