Asianet News TeluguAsianet News Telugu

కారణమిదీ: హైద్రాబాద్‌లో ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు నిలిపివేత

హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు సాయంత్రం నిలిచిపోయింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల తరపున ఏజంట్ల అభ్యంతరంతో అధికారులు ఓట్ల లెక్కింపును నిలిపివేశారు.
 

officials stopped MLC counting due to 50 votes missing in Hyderabad segment
Author
Hyde Park, First Published Mar 19, 2021, 4:35 PM IST

హైదరాబాద్: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు శుక్రవారం నాడు సాయంత్రం నిలిచిపోయింది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్ధుల తరపున ఏజంట్ల అభ్యంతరంతో అధికారులు ఓట్ల లెక్కింపును నిలిపివేశారు.

ఈ స్థానంలో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపులో ఎవరికీ విజయం దక్కలేదు. దీంతో ఎలిమినేషన్ ప్రక్రియను ప్రారంభించారు. ఈ ప్రక్రియలో  8 మంది అభ్యర్ధులు ఎలిమినేషన్ సమయంలో 50 ఓట్లు గల్లంతయ్యాయి.   ఈ విషయాన్ని సిబ్బంది తెలిపారు. 

ఓట్ల గల్లంతుపై బీజేపీ, కాంగ్రెస్ ఏజంట్లు అభ్యంతరం వ్యక్తం చేశారు.  అంతేకాదు ఈ విషయమై  రెండు పార్టీలకు చెందిన ఏజంట్లు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. 50 ఓట్లు ఎలా గల్లంతయ్యాయయనే విషయమై ఎన్నికల సిబ్బంది స్పష్టం చేయడం లేదని ఏజంట్లు ఆరోపిస్తున్నారు.ఈ ఓట్ల లెక్క తేలేవరకు  ఓట్ల లెక్కింపును నిలిపివేయాలని ఏజంట్లు అధికారులను కోరారు. దీంతో ఓట్ల లెక్కింపును నిలిపివేశారు.

హైద్రాబాద్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి సురభి వాణీదేవి ముందంజలో ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో బీజేపీ అభ్యర్ధి రామచంద్రరావు నిలిచారు. 

Follow Us:
Download App:
  • android
  • ios