Asianet News TeluguAsianet News Telugu

మాదాపూర్‌లో రెండు భారీ భవనాల కూల్చివేత .. రెప్పపాటులో కుప్పకూలిన భవంతులు

హైదరాబాద్‌లోని మాదాపూర్ మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాలను అధికారులు కూల్చివేశారు.  ఈ రెండు భవనాల కూల్చివేతకు భారీ ఎత్తున పేలుడు పదార్ధాలను వాడినట్లుగా అధికారులు తెలిపారు. కూల్చివేత సమయంలో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు 

Officials completed demolition of two buildings in hyderabad madhapur ksp
Author
First Published Sep 23, 2023, 3:59 PM IST

హైదరాబాద్‌లోని మాదాపూర్ మైండ్ స్పేస్‌లో రెండు భారీ భవనాలను అధికారులు కూల్చివేశారు. అధునాతన సాంకేతిక విధానాలను ఉపయోగించి భవనాలను కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు. మాదాపూర్ మైండ్ స్పేస్‌లో వున్న నెంబర్ 7, 8 భవనాలను పేలుడు పదార్థాలతో క్షణాల్లో నేలమట్టం చేశారు. ఏడంతస్తుల్లో వున్న రెండు భవనాలను ఐదు క్షణాల్లో కుప్పకూల్చారు. ఎడిపిక్ ఇంజనీరింగ్ సంస్థ భవనాల కూల్చివేత చర్యలను చేపట్టింది. ఈ రెండు భవనాల స్థానంలో కొత్త భవనాలను నిర్మిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

కొద్దికాలం క్రితమే ఈ రెండు భవనాలను అధునాతన రీతిలో నిర్మించారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల భవనాలకు సమస్యలు రావడంతో రెండింటిని ఏకకాలంలో కూల్చివేయాలని నిర్ణయించారు. మాదాపూర్‌లోని వెస్ట్రిన్ హోటల్ పక్కనే వున్న ఈ రెండు భవనాలను క్షణాల్లో కూల్చివేశారు. ఈ రెండు భవనాల కూల్చివేతకు భారీ ఎత్తున పేలుడు పదార్ధాలను వాడినట్లుగా అధికారులు తెలిపారు. భవనాలను కూల్చివేసే సమయంలో అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios