Asianet News TeluguAsianet News Telugu

పాతబస్తీలో క్షుద్రపూజలు.. రెండో పెళ్లికి అడ్డుగా ఉందని భార్యపై చేతబడి..!!

రెండో పెళ్లికి అడ్డుగా ఉందని ఓ భర్త, భార్య మీద చేతబడి చేపించి చంపే ప్రయత్నం చేశాడు. పోలీసులు అడ్డుకోవడంతో అతని ప్రయత్నం విఫలం అయ్యింది. 

occult worship in old city, man tries to kill wife over second marriage in hyderabad
Author
First Published Sep 7, 2022, 1:37 PM IST

హైదరాబాద్ : పాతబస్తీలో క్షుద్రపూజల కలకలం రేగింది. భార్యను చంపేందుకు చేతబడి ప్రయోగం చేశాడు ఓ భర్త. రెండో పెళ్లికి అడ్డుగా ఉన్న భార్యపై క్షుద్ర పూజలు చేయించాడు అతను. అయితే, స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు పూజల స్థావరంపై దాడి చేసి దొంగ బాబాను అరెస్టు చేశారు. బాధిత మహిళను రక్షించి ఆస్పత్రికి తరలించారు.

ఇదిలా ఉండగా, ఆగస్ట్ 16న ఇలాంటి ఘటనే కరీంనగర్ లో కలకలం సృష్టించింది. స్వాతంత్ర్య దినోత్సవ వేళ జాతీయ జెండా సాక్షిగా భార్యను ఓ భర్త దారుణంగా హత్య చేసిన ఘటన కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం చిగురుమామిడి మండలం ఇందుర్తికి చెందిన కనకం ప్రవీణ్, కేశవపట్నం మండల కేంద్రానికి చెందిన శిరీష (30) 11యేళ్ల కిందట ప్రేమించి,పెళ్లి చేసుకున్నారు. వీరికి 9, 8 ఏళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శిరీష నాలుగేళ్లుగా అంగన్వాడిలో ఆయాగా పనిచేస్తుంది. భార్యాభర్తల మధ్య గత కొద్ది రోజులుగా కుటుంబకలహాలు జరుగుతున్నాయి. దీంతో శిరీష భర్తకు దూరంగా కేశవపట్నంలోనే ఉంటుంది. విడాకుల కోసం భర్తకు నోటీసులు పంపించింది.

హైదరాబాద్ ఐఐటీకి చెందిన మరో విద్యార్థి ఆత్మహత్య.. లాడ్జిపై నుంచి దూకి బలవన్మరణం

15th ఆగస్ట్ రోజు అంగన్వాడీ కేంద్రం వద్ద జాతీయ జెండా ఆవిష్కరణలో ఆమె పాల్గొంది. చిన్నారులకు మిఠాయిలు పంపిణీ చేసేందుకు సిద్ధమవుతున్న సమయంలో అక్కడికి ప్రవీణ్ వచ్చాడు. అందరూ చూస్తుండగానే ఆమెను రోడ్డుపైకి ఈడ్చుకు వెళ్ళాడు. జనం అంతా చూస్తూ ఉండగానే కత్తితో గొంతు కోయడంతో.. ఆమె ఘటనా స్థలంలోనే తుదిశ్వాస విడిచింది. కుమార్ అనే యువకుడు అడ్డుకోగా.. అతడిని కూడా కత్తితో పొడిచాడు. దీంతో అతడికి  చిన్న గాయం అయ్యింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో… వారు అక్కడికి చేరుకునేసరికే నిందితుడు పరారీలో ఉన్నాడు. 

ఇదిలా ఉండగా, మహారాష్ట్రలోని థానేలో షాకింగ్ ఘటన జరిగింది. థానేలోని ముంబ్రాకు చెందిన 23 ఏళ్ల యువకుడు గర్భిణి అయిన తన మాజీ ప్రియురాలిని గొంతు కోసి హత్య చేశాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. మృతురాలు ముస్కాన్ అలియాస్ నదియా ముల్లాగా, నిందితుడిని ఓ ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న అల్తమాష్ దల్వీగా గుర్తించారు.

అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ కృపాలి బోర్సే తెలిపిన వివరాల ప్రకారం... శనివారం మధ్యాహ్నం 3-5.30 గంటల మధ్య విరాని ఎస్టేట్ లో ఈ ఘటన జరిగింది. నిందితుడు పదునైన ఆయుధంతో ముల్లా గొంతు కోశాడు. ఆ తరువాత నిందితుడు ముంబ్రా నుండి పారిపోబోతున్నాడని తమకు సమాచారం అందిందని, దీంతో వెంటనే అలర్ట్ అయిన పోలీసులు థానే రైల్వే స్టేషన్ సమీపంలో అతనిని పట్టుకుని ముంబ్రా పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చామని తెలిపారు. విచారణలో, తనకు, మృతురాలికి మధ్య రెండేళ్లుగా సంబంధం ఉందని, వారి తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో కొన్ని నెలల క్రితం తామిద్దరం విడిపోయామని దాల్వీ పేర్కొన్నాడు. కొన్ని నెలల క్రితమే ఆమెకు అబార్షన్ అయ్యిందని, ఆ తర్వాత తామిద్దరి మధ్య మాటలు లేవని చెప్పాడు.

వారు విడిపోయిన తర్వాత, దాల్వీ తల్లిదండ్రులు అతనికోసం సంబంధాలు చూస్తున్నారు. నవీ ముంబైలో ఉన్న ఒక అమ్మాయితో అతని వివాహాన్ని నిశ్చయించారు. కానీ ముల్లా ఆ అమ్మాయి ఇంటికి వెళ్లి గొడవ చేసింది. దీంతో నిందితుడికి విపరీతమైన కోపం వచ్చింది.. ఆ తరువాత తాను మళ్లీ గర్బవతినయ్యానని.. దానికి అతడే కారణం అని.. డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం ప్రారంభించింది. అతను ఆమెకు దాదాపు రూ.1.5 లక్షలు చెల్లించాడు. ఆమె ఇంకా కావాలని అడుగుతుండడంతో మాట్లాడదాం రమ్మని ఒక దగ్గరికి పిలిచాడు. అక్కడ ఆమె గొంతు కోశాడని పోలీసులు తెలిపారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios