న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నట్టుగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ చెప్పారు. శుక్రవారం నాడు హైద్రాబాద్ లో జరిగిన న్యాయాధికారుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. 


హైదరాబాద్:న్యాయ వ్యవస్థాలో పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం తన శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నానని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ NV Ramana చెప్పారు. Hyderabadలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి న్యాయాధికారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. న్యాయాధికారులు భయం లేకుండా తమ పని తాము చేయాలని ఆయన సూచించారు. మరో వైపు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని ఆయన న్యాయాధికారులకు సూచించారు. న్యాయ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నాలు చేయాలని ఆయన కోరారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత తొలిసారిగా Judicial Officers సమావేశం లో కలుసుకున్నామని సీజేఐ గుర్తు చేశారు. .న్యాయ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో Courts సంఖ్యను మరింత పెంచుతున్నామని సీజేఐ ఎన్వీ రమణ తెలిపారు.హైకోర్టులో జడ్జిల సంఖ్యను పెంచామన్నారు. త్వరితగతిన కేసుల పరిష్కారానికి Judges ల సంఖ్య పెంపు అవసరమన్నారు. కేంద్రంతో పాటు పలు రాష్ట్రాలు ప్రభుత్వ ఉద్యోగాలను తగ్గించాలని చూస్తున్న తరుణంలో న్యాయ సేవా విభాగంలో 4300లకు పైగా ప్రభుత్వ పోస్టులను ఏర్పాటు చేసిన తెలంగాణ సీఎం KCR కు సీజేఐ ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ చేతికి ఎముక లేదనడానికి ఇది నిదర్శనమన్నారు. హైద్రాబాద్ లో ఇంటర్నేషనల్ అర్బిటేషన్ సెంటర్ ను ఏర్పాటు చేశారన్నారు. ఈ సెంటర్ ను చూసిన ఇతర రాష్ట్రాలు కూడా తమ రాష్ట్రాల్లో కూడా ఈ తరహా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరుతున్న విషయాన్ని సీజేఐ ఈ సందర్భంగా ప్రస్తావించారు.

అంతకుముందు ఈ సమావేశంలో పాల్గొన్న తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రసంగించారు.సీజేఐ ఎన్వీ రమణ చొరవతో తెలంగాణ హైకోర్టులో జడ్జిల నియామకం పెరిగిందని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.High Court విడిపోయిన తర్వాత చెంచీల సంఖ్యను పెంచాలని కేంద్రానికి రాసినట్టుగా కేసీఆర్ చెప్పారు. సీజేఐ చొరవతో 24 నుండి 42కి తెలంగాణ హైకోర్టులో బెంచీల సంఖ్య పెరిగిందని సీఎం వివరించారు. హైకోర్టు న్యాయమూర్తుల కోసం ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో క్వార్టర్స్ నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. స్థల పరిశీలన పూర్తైన తర్వాత ఈ క్వార్టర్స్ శంకుస్థాపన కార్యక్రమానికి రావాలని సీఎం కేసీఆర్ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కోరారు.

చక్కటి ఆర్ధిక క్రమశిక్షణతో తెలంగాణ రాష్ట్రం అభివృద్దిలో దూసుకుపోతుందని కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ న్యాయ శాఖ దేశానికే ఆదర్శంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని సీఎం కేసీఆర్ చెప్పారు.పరిపాలన సంస్కరణల్లో భాగంగా రాష్ట్రంలో 33 జిల్లాలను ఏర్పాటు చేశామని సీఎం కేసీఆర్ తెలిపారు.ఐటీ రంగంలో కూడా తెలంగాణ రాష్ట్రం దూసుకుపోతోందని సీఎం కేసీఆర్ వివరించారు. విద్యుత్ రంగంలో కూడా అద్భుతమైన పురోగతిని సాధించామన్నారు.జిల్లా కోర్టుల్లో పని భారం ఎక్కువగా ఉందని తనకు సమాచారం ఉందన్నారు. ఈ పనిభారాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలని ఆయన తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ ను కోరారు. రాష్ట్రంలోని 22 జిల్లాల్లో జిల్లా కోర్టుల్ని ప్రారంభించనున్నామని సీఎం తెలిపారు.

కోర్టులపై ఉన్న గౌరవంతో రెవిన్యూ కోర్టులను కూడా రద్దు చేసిన విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు. జిల్లా కోర్టులకు 1730 అదనంగా పోస్టులు మంజూరు చేస్తున్నట్టుగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. జిల్లాల్లో కోర్టు భవనాల నిర్మాణం కోసం కూడా స్థలాల ఎంపిక జరుగుతుందన్నారు. 
.