హైదరాబాద్: నిమ్స్ లో  నిర్మల  అనే నర్సు గొంతు కోసుకొని  గురువారం నాడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన నిమ్స్‌లో కలకలానికి దారి తీసింది. గురువారం నాడు మధ్యాహ్నం నిమ్స్ ఆసుపత్రిలో  నిర్మల అనే నర్సు బ్లేడుతో తన గొంతు కోసుకొంది.

తనకు ప్రమోషన్ ఇవ్వకుండా అడ్డుకొని అన్యాయం చేశారని నిర్మల మనోవేదనకు గురైంది. దీంతో తనకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేసింది. ఉన్నతాధికారుల నుండి  సరైన స్పందన రాలేదని బాధితులు ఆరోపిస్తున్నారు.

గురువారం నాడు  నిమ్స్ ఆసుపత్రి ఆవరణలోనే బాధితురాలు బ్లేడ్‌‌తో గొంతు కోసుకొని ఆత్మహత్యాయత్నం చేసుకొంది. వెంటనే ఆమెకు చికిత్స అందిస్తున్నారు.